Suriya-jyotika: స్వర్గంలో మరో రోజు మనిద్దరం
ABN , Publish Date - Jun 29 , 2025 | 08:37 PM
సినీ తారలకు వెకేషన్ దొరికితే ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తుంటారు. విదేశాలకు టూర్స్‌కి చెక్కేస్తుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు తమిళ స్టార్ సూర్య, ఆయన సతీమణి జ్యోతిక
సినీ తారలకు వెకేషన్ దొరికితే ఫ్యామిలీ కోసం సమయం కేటాయిస్తుంటారు. విదేశాలకు టూర్స్‌కి చెక్కేస్తుంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నారు తమిళ స్టార్ సూర్య, ఆయన సతీమణి జ్యోతిక (Suriya-jyotika). తూర్పు ఆఫ్రికాలోని సీషెల్స్‌కు ఈ జంట విహార యాత్రకు వెళ్లింది. సముద్రం, ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియోను జ్యోతిక ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘స్వర్గంలో మరో రోజు మనిద్దరం’ అని ఆమె క్యాప్షన్ పెట్టారు (jyotika post viral) ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మధ్యన సూర్య నటించిన చిత్రాలేవీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ‘కంగువా’, ‘రెట్రో’ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరితో ఓ సినిమా చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మమితా బైజు కథానాయిక. ఇది పూర్తిస్థాయి కుటుంబ కథా చిత్రమిదని, అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని దర్శకుడు అన్నారు. అలాగే తమిళంలో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ‘కరుప్పు’లో సూర్య నటిస్తున్నారు.