Peddi: చూస్తుంటే సినిమా, ఆలోచిస్తే చరిత్ర.. ‘పెద్ది’పై టీడీపీ ఎమ్మెల్యే పోస్ట్ వైరల్
ABN, Publish Date - Jun 07 , 2026 | 10:16 PM
‘పెద్ది’ విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. ఈ సినిమా ఎలా ఉందో చెబుతూ గోపాలపురం నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే రివ్యూ ఇచ్చారు.
‘పెద్ది’ (Peddi) విడుదలైన అన్ని చోట్ల కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) నటనకు అంతా ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నా.. మౌత్ టాక్ రోజురోజుకూ బలపడుతోంది. మొదటి వీకెండ్ ముగిసే సమయానికి దాదాపు 70 శాతం రికవరీ అవుతుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. మరోవైపు ఈ సినిమాను చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన టీడీపీ ఎమ్మెల్యే ఒకరు.. ‘ఒక సినిమా గురించి స్పందించడం ఇదే మొదటిసారి’ అంటూ.. ‘పెద్ది’పై ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట రాజు (TDP MLA Maddipati Venkata Raju), తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ‘పెద్ది’ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘చూస్తుంటే సినిమా అనిపిస్తుంది… ఆలోచిస్తే చరిత్ర అనిపిస్తుంది’ అంటూ ఆయన ఇచ్చిన రివ్యూని మెగాభిమానులు వైరల్ చేస్తున్నారు. ‘అద్భుతమైన రివ్యూ ఇచ్చారు బ్రదర్.. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తినింపే చిత్రమిది. యూత్ అంతా ఈ సినిమా చూడాలి’ అంటూ ఈ పోస్ట్‌కు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అసలింతకీ ఎమ్మెల్యే చేసిన పోస్ట్‌లో ఏం చెప్పారంటే..
‘‘ఒక సినిమా గురించి స్పందన రాయడం ఇదే తొలిసారి.
‘పెద్ది’ సినిమా…
ఇది ఒక నాయకుడి కథ కాదు… ఒక జాతి ఆశల కథ.
తన ప్రజల కోసం పడిలేచిన కెరటంలా మారిన నాయకుడి గాథ. ప్రతి అడుగులో పోరాటాన్ని ఎదుర్కొంటూ, ప్రతి ఓటమిని విజయానికి మెట్టుగా మార్చుకున్న యోధుడి కథ.
తన ప్రజల కోసం, జాతి భవిష్యత్తు కోసం తన జీవితాన్నే పణంగా పెట్టిన వీరుడి ప్రయాణం. ఓడిపోతూ గెలవడం అంటే ఏమిటో చూపించిన అసాధారణ ఆటగాడి ఆత్మకథ.
చూస్తుంటే సినిమా అనిపిస్తుంది… ఆలోచిస్తే చరిత్ర అనిపిస్తుంది.
అనుభవిస్తే ఒక నాయకుడి జీవిత గాథగా కనిపిస్తుంది… అర్థం చేసుకుంటే ఒక యుగం సాగించిన పోరాటం కనిపిస్తుంది.
కొన్ని కథలు వినోదాన్ని పంచుతాయి…
కొన్ని కథలు స్ఫూర్తిని నింపుతాయి…
కానీ ‘పెద్ది’లాంటి కథలు తరాలను ఆలోచింపజేస్తాయి..’’ అని చిన్న నిర్మాత, దర్శకుడు, హీరో, మైత్రీ సంస్థ ట్విట్టర్ ఐడీలను ట్యాగ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
Peddi: గురువు సుకుమార్‌లా బ్యాలెన్స్ చేయలేకపోయిన బుచ్చి!
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!