సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Summer Holidays: ప్రమోషన్స్ చాలు... సినిమా రిలీజ్ చేయండి!

ABN, Publish Date - Oct 07 , 2026 | 03:10 PM

సమ్మర్ హాలిడేస్ సినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. ఇప్పటికే క్రష్ సాంగ్, స్కూల్ సాంగ్ తర్వాత తాజాగా ఫ్రెండ్‌షిప్ సాంగ్‌ను విడుదల చేశారు.

Summer Holidays Movie

కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే యూ ట్యూబ్ లో ఎక్కువ కాలం ఆడుతుంటాయి. సినిమా విడుదల తేదీ ప్రకటించకుండా... ఇదిదో వస్తున్నాం... అదిగో వస్తున్నాం... అంటూ హంగామా చేస్తూ టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్‌ తో కాలయాపన చేస్తుంటారు. గత కొంతకాలంగా 'సమ్మర్ హాలిడేస్' మూవీ విషయంలోనూ అదే జరుగుతోంది. సినిమా పూర్తి కాకనో, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం కావడం వల్లనే సినిమా విడుదల వాయిదా పడిందంటే అనుకోవచ్చు. కానీ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన మూవీ విషయంలోనూ తాత్సారం చేస్తూ పోతే... దాని మీద ఉన్న కొద్ది పాటి క్రేజ్‌ కూడా తగ్గిపోతుంది.

మాస్టర్ రోహన్‌, మాస్టర్ అరుణ్‌, బేబీ ఖుషీ కీలక పాత్రలు పోషించిన 'సమ్మర్ హాలిడేస్' మూవీని మే 1న విడుదల చేయబోతున్నట్టు తొలుత నిర్మాత ధీరజ్‌ మొగిలినేని ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికి ఆ సినిమా విడుదల కాలేదు. దాంతో టైటిల్‌ జస్టిఫికేషన్ గా సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడిపోయింది. ఓ మంచి తేదీ చూసి మూవీని రిలీజ్ చేస్తామని ధీరజ్‌ మొగిలినేని అప్పట్లో చెప్పారు. చూస్తుండగానే ఐదు నెలలు గడిచిపోయాయి. మంచి రోజు మాత్రం ఇంకా వచ్చినట్టుగా లేదు. మే 1 నుంచి ఈ సినిమాలోని ఒక్కో పాటనూ విడుదల చేస్తున్నారు కానీ రిలీజ్‌ డేట్ ను మాత్రం ప్రకటించడం లేదు. నిజానికి ఇవాళ్టి రోజుల్లో పిల్లలపై సినిమా తీయడమే ఒక పెద్ద సాహసం. దానిని దర్శకుడు శ్రీకర్‌ సమర్థవంతంగా నిర్వహించాడని ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో సినిమా రంగానికి చెందిన వారు తెలిపారు. మరి అంత హార్ట్ టచ్చింగ్‌ గా ఉన్న ఈ సినిమాను ఇంకా ఇంకా వాయిదా వేయడం వెనుక ఆంతర్యం ఏమిటో బోధపడటం లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.


ఇదిలా ఉంటే... 'సమ్మర్ హాలిడేస్' మూవీ నుంచి తాజాగా 'ఫ్రెండ్ షిప్‌' సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటకు సింజిత్ యెర్రమల్లి బ్యూటిఫుల్ ట్యూన్ చేశారు. ఈ పాట పల్లవికి పూర్ణాచారి సాహిత్యం అందించగా; చరణం, హుక్ లైన్ కిట్టు విస్సాప్రగడ రాశారు. శ్రీరామచంద్ర ఆకట్టుకునేలా దీనిని పాడారు. ఈ పాటలో మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, సింగర్ శ్రీరామచంద్ర నటించడం విశేషం. ఇక దీనికి ముందు విడుదలైన 'క్రష్ సాంగ్..', 'స్కూల్ సాంగ్'కు మ్యూజిక్ లవర్స్ నుంచి హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందని మేకర్స్ తెలిపారు. ఏదేమైనా... ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాలో జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి:

మండాడి సంచలన రికార్డు.. సుహాస్, సూరి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్

అభిమాని హ‌త్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్

ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!

Updated Date - Oct 07 , 2026 | 03:23 PM