నభా నటేశ్ మరో రొమాంటిక్ మూవీ!
ABN , Publish Date - Oct 07 , 2026 | 01:09 PM
ధ్రువ సర్జా నభా నటేశ్ జంటగా కెమిస్ట్రీ సినిమా తెరకెక్కుతోంది. విశాల్ ఆత్రేయ దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ లవ్ స్టోరీపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
హీరోయిన్ నభా నటేశ్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రిన్స్ ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న 'కెమిస్ట్రీ' సినిమాలో నభా హీరోయిన్ గా అలరించబోతోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. దర్శకుడు విశాల్ ఆత్రేయ రూపొందిస్తున్నారు. తాజాగా మూవీ టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.
కెరీర్ బిగినింగ్ లో రొమాంటిక్ మూవీస్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేశ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జానర్ లో 'కెమిస్ట్రీ' సినిమా చేస్తోంది. చాలా రోజుల తర్వాత ఒక కంప్లీట్ లవ్ స్టోరీలో 'కెమిస్ట్రీ' సినిమాతోనే నభా కనిపించడం విశేషం. ధ్రువ సర్జా, నభా నటేశ్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్ గా నిలవనుంది. ఈ ఫ్రెష్ పెయిర్ ను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఈ ఏడాది 'నాగబంధం' సినిమాలో తన పర్ ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసింది నభా నటేశ్.
ఇవి కూడా చదవండి:
అభిమాని హత్య కేసు.. దర్శన్‌కు మరో బిగ్ షాక్
ధనుష్ కొత్త పార్టీ.. 'తమిళగ ఎళుచ్చి కళగం'? ఈసీ వద్ద నమోదు!
నిన్న రాజశేఖర్.. నేడు విజయ శాంతి! అసలు బాలయ్యతో.. ఏం ఫ్లాన్ చేస్తున్నావ్ శివయ్య