సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘వారణాసి’ తర్వాత జక్కన్న మనకు కనబడరా..

ABN, Publish Date - Oct 24 , 2026 | 07:38 AM

భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక విజువల్ వండర్ ‘వారణాసి’. ఈ చిత్రం తర్వాత రాజమౌళి స్టెప్‌కు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతోంది.

SS Rajamouli

భారతీయ సినీ పరిశ్రమను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక విజువల్ వండర్ ‘వారణాసి’ (Varanasi). ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. కేవలం మరో పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉండగా, అది పూర్తి కాగానే రాజమౌళి పూర్తిస్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో సరికొత్త కాన్వాస్‌పై రూపొందుతున్న ‘వారణాసి’ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, ఈ భారీ చిత్రం పూర్తయ్యాక జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? ఆయన ఎవరితో సినిమా చేయనున్నారు? అనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కొందరి హీరోల పేర్లు వినిపించడం, అదేం లేదని జక్కన్న (Jakkanna) వివరణ ఇవ్వడం కూడా జరిగిపోయింది.


ఈ నేపథ్యంలో బ్రెజిల్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రాజమౌళి తన భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘వారణాసి’ తర్వాత తన ప్రయాణం ఎలా ఉండబోతోందనే దానిపై ఆయన మాట్లాడుతూ.. హాలీవుడ్ నుంచి తనకు అద్భుతమైన ఆఫర్లు వచ్చాయని స్పష్టం చేశారు. ‘‘గ్లోబల్ సెన్సేషన్ ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత నాతో ప్రాజెక్టులు చేయడానికి హాలీవుడ్ నుంచి చాలా మంది ప్రముఖ నిర్మాతలు, సంస్థలు సంప్రదించాయి. ఆ ఆఫర్లు ఇప్పటికీ ఓపెన్‌లోనే ఉన్నాయి. అయితే ఒకేసారి రెండు మూడు ప్రాజెక్టులను డీల్ చేయడం నాకు అలవాటు లేదు. పూర్తి ఏకాగ్రతతో పనిచేయడానికే మొగ్గు చూపుతాను కాబట్టే, పూర్తిగా ‘వారణాసి’ మీదే ఫోకస్ పెట్టాను’’ అని జక్కన్న వివరించారు.


అంతేకాకుండా హాలీవుడ్ పనితీరు, అక్కడి ప్రణాళికలు చాలా వైవిధ్యంగా ఉంటాయని రాజమౌళి కొనియాడారు. హాలీవుడ్‌లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలన్నది తన చిరకాల కోరిక అని ఆయన ఈ వేదికపై ఓపెన్‌గా వెల్లడించారు. జక్కన్న చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ‘వారణాసి’ విడుదలైన తర్వాత రాజమౌళి నేరుగా అంతర్జాతీయ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తారా? టాలీవుడ్‌కు కొంతకాలం విరామమిచ్చి హాలీవుడ్ స్టూడియోల వైపు అడుగులు వేస్తారా? అన్న చర్చ జోరందుకుంది. ఒకవేళ అదే జరిగితే, ఇండియన్ స్క్రీన్‌పై రాజమౌళి మార్క్ మ్యాజిక్‌ను చూడటానికి మన ప్రేక్షకులు మరికొంత కాలం వేచి చూడాల్సి రావొచ్చు!.. చూద్దాం.. ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

సీమ గడ్డపై రౌడీ హీరో భావోద్వేగం.. ‘రణబాలి’ రణభేరిలో స్పీచ్ అదిరింది

బాలయ్యకు పోటీగా యంగ్ హీరో.. ఆ సూపర్ స్టారే ఆదర్శమా..

‘మిస్టర్ దెయ్యం’కు మంచు మనోజ్ సపోర్ట్.. ఏం చేశారంటే

Updated Date - Oct 24 , 2026 | 07:38 AM