SS Rajamouli : ఇక జర్మనీ వెళ్లాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Jan 11 , 2025 | 03:29 AM
భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి ప్రారంభించారు.
భారతదేశంలో మొట్టమొదటి డాల్బీ సర్టిఫైడ్ పోస్ట్‌ప్రొడక్షన్ ఫెసిలిటీని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రముఖ దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టూడియో వైస్ చైర్మన్, హీరో నాగార్జున అక్కినేని, ఈడీ సుప్రియా యార్లగడ్డ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్ నిర్మాణ సమయంలో మేము సినిమాను డాల్బీ విజన్‌లో గ్రేడ్ చేయాలనుకున్నప్పుడు, జర్మనీ వరకు ప్రయాణించాల్సి వచ్చింది. మన దేశంలోనే డాల్బీ విజన్‌లో నా సినిమాను ఎక్స్ పీరియన్స్ చేయలేకపోవడం కొంచెం నిరుత్సాహపరిచింది. కానీ ఈ రోజు, అన్నపూర్ణ స్టూడియో్‌సలో డాల్బీ విజన్ గ్రేడింగ్ సౌకర్యాన్ని చూసి చాలా థ్రిల్ అయ్యాను’ అని అన్నారు. నాగార్జున అక్కినేని మాట్లాడుతూ ‘ అన్నపూర్ణ స్టూడియోస్ 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా డాల్బీతో ఈ సహకారం గొప్ప దార్శనికతకు నిదర్శనం. అన్నపూర్ణలో చేంజ్ ఇన్నోవేషన్ స్వీకరించడం మా లెగసీ, ఇది ఆ ప్రయాణంలో మరో ముందడుగు’ అని అన్నారు.
- రాజమౌళి