ఘట్టమనేని వారసుడి ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ ఎలా ఉందంటే?

ABN , Publish Date - Apr 15 , 2026 | 06:47 PM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్ భూపతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్ర టీజర్‌ని మహేష్ బాబు విడుదల చేశారు.

Srinivasa Mangapuram Movie

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, మహేష్ బాబు (Mahesh Babu) సోదరుడి కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’ (Srinivasa Mangapuram). ‘RX 100, మంగళవారం’ చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని (Rasha Thadani) ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్న విషయం తెలిసిందే. బుధవారం (ఏప్రిల్ 15) ఈ చిత్ర టీజర్‌ని సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఎక్స్’ వేదికగా విడుదల చేశారు. ‘‘శ్రీనివాస మంగాపురం’ టీజర్‌ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉంది... టీజర్ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తోంది. జయకృష్ణ ఈ అందమైన సినిమా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు గర్వంగా ఉంది. అతనికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి అడుగులోనూ అతను ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను’’ అని మహేష్ బాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


టీజర్ ఎలా ఉందంటే (Srinivasa Mangapuram Teaser Review).. ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్ చూస్తుంటే, ఒక ప్యూర్ అండ్ ఇంటెన్స్ లవ్ స్టోరీలా అనిపిస్తోంది. తిరుపతి నేపథ్యంలో సాగే ఈ కథలో ఎమోషన్స్‌ని దర్శకుడు బాగా రాబట్టినట్లుగా తెలుస్తోంది. టీజర్‌లో జయకృష్ణ లుక్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నాయి. ముఖ్యంగా రషా తడాని హీరోయిన్‌గా చాలా క్యూట్‌గా, ఇంప్రెసివ్‌గా కనిపిస్తోంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ‘మంగ నీది కాదు వాసు బాబు’, ‘మంగ లేకుండా ఈ వాసు బాబు తిరుపతి విడిచి వెళ్ళడు’ వంటి డైలాగ్స్ కథలోని డెప్త్‌ను, హీరో క్యారెక్టర్‌లోని మొండితనాన్ని తెలియజేస్తున్నాయి. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. అజయ్ భూపతి మార్క్ మేకింగ్ కనిపిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ఎమోషన్‌ను బాగా ఎలివేట్ చేసింది.


తిరుపతి పరిసర ప్రాంతాల్లో షూట్ చేయడం వల్ల ఒక నేటివిటీ ఫీల్ వస్తోంది. మోహన్ బాబు వంటి సీనియర్ నటులు ఉండటం సినిమాకు అదనపు బలం. ఆయన క్యారెక్టర్ కూడా ఇందులో సింపుల్‌గా టచ్ చేశారు. ఇందులో భారీ తారాగణం ఉన్నట్లుగా ఈ టీజర్ క్లారిటీ ఇస్తోంది. చాలా వరకు పాత్రలను పరిచయం చేశారు. ఈ టీజర్ ఒక ఫ్రెష్ అండ్ ఇంటెన్స్ వైబ్‌ని కలిగి ఉంది. అజయ్ భూపతి గత చిత్రమైన ‘RX 100’ తరహా బలమైన ప్రేమకథ, అంతకుమించిన ఎమోషన్స్ ఉంటాయనేలా తెలియజేయడంలో ఈ టీజర్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అగ్ర నిర్మాత అశ్విని దత్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని పి కిరణ్ నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది

మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ ప్రాక్టీస్‌ సెషన్‌లో ప్రమాదం

దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ

అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్

UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!

Updated Date - Apr 15 , 2026 | 07:04 PM

Srinivasa Mangapuram: కృష్ణ మ‌నుమ‌డు.. రంగంలోకి దిగాడు! తొలి వార‌సుడి.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన మ‌హేశ్ బాబు

Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం.. ర‌షా ఫ‌స్ట్‌ లుక్ అదిరింది.

Ajay Bhupathi: 'మంగళవారం' డైరెక్టర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ రెడీ.. ఆ సినిమా పోయినట్టే

Ajay Bhupathi: జయకృష్ణ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం

Rasha Thadani: జయకృష్ణ కోసం బాలీవుడ్‌ బ్యూటీ..