Srinivasa Mangapuram: శ్రీనివాస మంగాపురం.. ర‌షా ఫ‌స్ట్‌ లుక్ అదిరింది.

ABN , Publish Date - Jan 30 , 2026 | 12:29 PM

ర‌మేశ్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ హీరోగా శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.

Srinivasa Mangapuram

దివంగ‌త సూప‌ర్ స్టార్ కృష్ణ మ‌నుమ‌డు, ర‌మేశ్ బాబు త‌న‌యుడు జ‌య‌కృష్ణ (Ghattamaneni Jayakrishna) హీరోగా శ్రీనివాస మంగాపురం (Srinivasa Mangapuram) సినిమాతో ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆరెక్స్ 100 డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ద‌ర్శకత్వం వ‌హిస్తున్న ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ కిడ్ ప్ర‌జంట్ యూత్ హార్ట్ త్రోబ్ ర‌షా త‌డాని (Rasha Thadani) హీరోయిన్‌గా టాలీవుఢ్ లో అరంగేట్రం చేస్తోంది. వైజ‌యంతీ మూవీస్ (Vyjayanthi Movies) అశ్వినీదత్ (Aswini Dutt), ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) జెమినీ కిర‌ణ్ (Gemini Kiran) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా జీవీ ప్ర‌కాశ్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు.

Srinivasa Mangapuram

ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన టైటిల్, హీరో ఫ‌స్ట్‌లుక్స్ సినిమాపై మంచి బ‌జ్ క్రియేట్ చేయ‌గా తాజాగా సినిమాలో మంగ పాత్ర పోషిస్తున్న‌ క‌థానాయిక ర‌షా ఫ‌స్ట్ లుక్ రివీల్ చేస్తూ వీడియో గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఓ పూల తోట‌లో అచ్చ తెలుగ‌మ్మాయి వేష‌ధార‌ణ‌లో ర‌షా లుక్ అదిరింది. కోటి మంది దేవతలు నా పక్కనుండి వెళ్తున్నా…నేను మాత్రం నిన్నే చూస్తూ ఉంటా.. అని శ్రీను చెబుతున్న‌ట్లు నోట్ పెట్టారు. అంతేగాక బ్యాగ్రౌండ్‌లో వ‌చ్చే విజిల్ సౌండ్ హైలెట్‌గా ఉంది. ఈ సినిమా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే నెలలో విడుదలవుతుందని తెలుస్తోంది.

Updated Date - Jan 30 , 2026 | 01:40 PM