Ajay Bhupathi: జయకృష్ణ చిత్రానికి జీవీ ప్రకాశ్ సంగీతం

ABN , Publish Date - Nov 20 , 2025 | 01:01 PM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్న సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్ సంగీతం అందించబోతున్నాడు. రవీనా టాండన్ కుమార్తె హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.

Jaya Krishna - GV Prakash Kumar

సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) మనవడు, రమేశ్ బాబు (Ramesh Babu) తనయుడు జయకృష్ణ ఘట్టమనేని (Jayakrishna Ghattamaneni) హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ (Ashwinidutt) సమర్పణలో 'జెమినీ' కిరణ్‌ (Gemini Kiran) మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనికి 'ఆర్.ఎక్స్. 100' (RX 100) ఫేమ్ అజయ్ భూపతి (Ajay Bhupathi) దర్శకుడు. అజయ్ భూపతి 'ఆర్.ఎక్స్. 100' తర్వాత 'మహాసముద్రం', 'మంగళవారం' చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా ఇది ఆయనకు నాలుగో సినిమా. జయకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో అతని సరసన ప్రముఖ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో రవీనా టాండన్ పలు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా చేసింది. రాషాకు మాత్రం ఇదో తొలి తెలుగు సినిమా. ఇక తాజాగా ఈ సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు మేకర్స్ తెలిపారు.


అజయ్ భూపతి గతంలో దర్శకత్వం వహించిన సినిమాలకు చైతన్ భరద్వాజ్, అజనీశ్‌ లోకనాథ్ సంగీతం అందించారు. జీవీ ప్రకాశ్‌ కుమార్ (GV Prakash Kumar) తో అజయ్ భూపతి వర్క్ చేయడం ఇదే మొదటిసారి. గడిచిన 19 సంవత్సరాలలో జీవీ ప్రకాశ్ కుమార్ వందకు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించాడు. తెలుగులోనూ పలు చిత్రాలకు స్వరాలు సమకూర్చాడు. అయితే జయకృష్ణ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు అతను సంగీతాన్ని అందించడం ప్రత్యేకతను సంతరించుకుంది. మరి ఈ సినిమా ఏ స్థాయిలో మ్యూజికల్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

Also Read: Tollywood: రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రత్యూష కేసు...

Also Read: Pooja Hegde: పూజా.. ల‌క్ మార‌దా! ధనుష్‌కు జోడీగా మ‌రోసారి సాయి పల్లవి?

Updated Date - Nov 20 , 2025 | 02:09 PM