మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ ప్రాక్టీస్ సెషన్‌లో ప్రమాదం
ABN , Publish Date - Apr 15 , 2026 | 05:42 PM
మెగా క్యాంప్‌లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. ఇలా వరుసగా మెగా హీరోలు షూటింగ్స్ కోసం గాయపడటం అభిమానులను కలవరపెడుతోంది.
మెగా క్యాంప్‌లో వరుసగా జరుగుతున్న ప్రమాదాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. రీసెంట్‌గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej).. ఇలా వరుసగా మెగా హీరోలు షూటింగ్స్ కోసం గాయపడటం అభిమానులను కలవరపెడుతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం ‘బరి’ (Bhari) కోసం ఎంతో కష్టపడుతున్నారు. వరుస పరాజయాల్లో ఉన్న వరుణ్, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ధ్యేయంతో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ వాలీబాల్ కావడంతో, ప్రొఫెషనల్ ప్లేయర్‌లా కనిపించేందుకు ఆయన తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో వాలీబాల్ ప్రాక్టీస్ సెషన్‌లో వరుణ్ కాలికి తీవ్రమైన ఫ్రాక్చర్ అయ్యింది. దీనిపై ఆయన సోదరి నిహారిక కొణిదెల అధికారిక ప్రకటన విడుదల చేశారు.
‘‘మా అన్న వరుణ్ తేజ్ ‘బరి’ సినిమా ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డారు. మోకాలికి తీవ్రమైన గాయం కావడంతో సర్జరీ అవసరమైంది. ప్రస్తుతం సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది, వైద్యుల పర్యవేక్షణలో ఆయన కోలుకుంటున్నారు. మీ అందరి ప్రేమ, ప్రార్థనలకు ధన్యవాదాలు’’ అని నిహారిక తన ఇన్‌స్టా అకౌంట్ ద్వారా పేర్కొన్నారు. దీంతో మెగా ప్రిన్స్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరో వైపు మెగా ఫ్యామిలీ హీరోలకు ఇలా గాయాలు, సర్జరీలు కావడంపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ చర్చలు నడుస్తున్నాయి.
కేవలం కొన్ని రోజుల క్రితమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా గాయపడ్డారు. ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో చరణ్‌కు కూడా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆయనకు సర్జరీ జరగడం, రెస్ట్ కూడా తీసుకోకుండా వెంటనే షూట్‌లో జాయిన్ అయినట్లుగా కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు సరిగ్గా వరుణ్ తేజ్ కూడా దాదాపు అదే తరహాలో గాయపడటం, సర్జరీ వరకు వెళ్లడం యాదృచ్ఛికమే అయినా మెగా ఫ్యాన్స్‌కు మాత్రం ఇది మింగుడు పడటం లేదు. సినిమాలోని పాత్రలు సహజంగా రావాలని మెగా హీరోలు డూప్స్ వాడకుండా రిస్క్ తీసుకుంటున్నారు. ‘బరి’ సినిమా కోసం వరుణ్ ప్రాణం పెట్టి పని చేస్తున్నారని ఈ ప్రమాదమే చెబుతోంది. నిహారిక విడుదల చేసిన ప్రకటన అనంతరం.. వరుణ్ తేజ్ త్వరగా కోలుకుని మళ్ళీ ‘బరి’లోకి దిగాలని కోరుకుంటున్నారు. మరోవైపు వరుణ్ తేజ్ నటించిన ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju) త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి:
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
అన్నీ ఉన్నాయ్ కానీ.. అన్నా లెజినోవా షాకింగ్ పోస్ట్!
షూటింగ్ బ్రేక్‌లో పాయల్ రాజ్‌పుత్ చేసే పనులివా?
‘చిరంజీవి’కి మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!