సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎస్.ఆర్. కళ్యాణమండపం దర్శకుడి కొత్త సినిమా!

ABN, Publish Date - Sep 07 , 2026 | 06:48 PM

కిరణ్‌ అబ్బవరం హీరోగా 'ఎస్.ఆర్. కళ్యాణ మండపం' చిత్రాన్ని రూపొందించిన శ్రీధర్‌ గాదె ఇప్పుడు మరో చిత్రాన్ని మొదలు పెట్టారు. 'కమిటీ కుర్రోళ్ళు' ఫేమ్‌ ఈశ్వర్‌ రాచి రాజు ఇందులో హీరోగా నటిస్తున్నాడు.

SR Kalyana Mandapam Director New Movie

'ఎస్‌.ఆర్. కళ్యాణ మండపం' చిత్రంతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న డైరెక్టర్ శ్రీధర్ గాదె మరో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై ఆది సాయికుమార్‌తో 'చుట్టాలబ్బాయ్' వంటి ఫ్యామిలీ మూవీ, ఆనంద్ దేవరకొండతో 'హైవే' వంటి యూనిక్ థ్రిల్లర్ చిత్రాన్ని నిర్మించిన ప్రొడ్యూసర్ వెంకట్ తలారి తమ ప్రొడక్షన్ నెం.3గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో 'కమిటీ కుర్రోళ్లు' మూవీ ఫేమ్ ఈశ్వర్ రాచి రాజు హీరోగా, నందు, లిఖిత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పూజిత పొన్నాడ, సింధు కాసారం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.


హైదరాబాద్‌లో సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకులు కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చి, దర్శక నిర్మాతలకు స్క్రిప్ట్ అందజేశారు. దర్శకుడు వీరభద్రం చౌదరి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని డైరెక్టర్ కోదండరామిరెడ్డి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే హారర్ చిత్రమిదని, సరికొత్త కథా కథనాలతో దీనిని తెరకెక్కించబోతున్నామని, దర్శకుడు శ్రీధర్ గాదె తెలిపారు. ఈ మూవీ ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ వినూత్నంగా ఉండి ఆసక్తి రేపుతోంది. ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Bipasha Basu: ఎనిమిదేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత వస్తోన్న బ్లాక్ బ్యూటీ 

Varanasi: రాజమౌళి ఎక్క‌డా.. త‌గ్గ‌డం లేదుగా

January 12 Vidudala: అనిల్ రావిపూడికి.. కొత్త టెన్ష‌న్‌!

ఇక‌.. ఒక్క‌రైనా సీట్లో కూర్చుంటే ఒట్టు

Updated Date - Sep 07 , 2026 | 06:51 PM