ఇక‌.. ఒక్క‌రైనా సీట్లో కూర్చుంటే ఒట్టు

ABN , Publish Date - Sep 06 , 2026 | 10:08 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డ్రాగన్ (Dragon). 'కేజీఎఫ్', 'సలార్' వంటి హిట్స్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా ఇదే. అటు 'దేవర' వంటి విజయం తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ టాలీవుడ్‌ను ఊపేయగా, మూవీపై అంచనాలు మరో స్థాయికి చేరిపోయాయి.

ఈ భారీ ప్రాజెక్టులో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) కథానాయికగా నటిస్తోంది. అంతేకాకుండా, ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, మలయాళ దిగ్గజ నటుడు బిజు మీనన్, సీనియర్ నటి ఖుష్బు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఎక్కడా తగ్గకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఆస్థాన సంగీత దర్శకుడు రవి బస్రూర్ ఈ సినిమాకి కూడా అదిరిపోయే మ్యూజిక్ అందిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. అయితే, తాజాగా ‘డ్రాగన్’ కు సంబంధించి ఒక క్రేజీ వార్త నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ మూవీలో ఓ మైండ్ బ్లోయింగ్ స్పెషల్ సాంగ్ ఉండబోతోందట.​అందులో కథానాయిక రుక్మిణి వసంత్‌తో పాటు.. మరో ఇద్దరు క్రేజీ భామలతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఊరమాస్ స్టెప్పులు వేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మాస్ నెంబర్ కోసం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఒక భారీ సెట్ కూడా వేయించినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, రుక్మిణితో పాటు తారక్‌తో రచ్చ చేయబోయే ఆ మిగతా ఇద్దరు హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారింది. ఈ స్పెషల్ సాంగ్ వార్తపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ.. ప్రశాంత్ నీల్ విజన్, రవి బస్రూర్ ఇచ్చే మాస్ బీట్స్‌కి.. ఎన్టీఆర్ ముగ్గురు భామలతో వేసే ఊరమాస్ స్టెప్పులకి థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆ సాంగ్ ప్లే అయ్యేటప్పుడు థియేటర్లలో ఒక్క ఫ్యాన్ కూడా సీట్లో కూర్చోవడం కష్టమేని అంటున్నారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమాలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్, బాలీవుడ్ టాప్ నటి ఆలియా భట్ కూడా నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. దీనిపై కూడా మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో తారక్ గాయపడిన సంగతి తెలిసిందే. చిన్న సర్జరీ జరగడంతో ఆయన ప్రస్తుతం డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నారు.

మరో రెండు వారాల్లో ఎన్టీఆర్ పూర్తిగా కోలుకొని డ్రాగన్ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు మైత్రీ నిర్మాత రవి శంకర్ ఇటీవల తెలిపారు. తారక్ కోలుకునేలోపు హీరో లేని సీన్లను, ఇతర పనులను ప్రశాంత్ నీల్ శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వచ్చే ఏడాది జూన్ 11వ తేదీన ‘డ్రాగన్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. మరి తొలిసారి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.

Updated Date - Sep 06 , 2026 | 10:09 PM