January 12 Vidudala: అనిల్ రావిపూడికి.. కొత్త టెన్షన్!
ABN , Publish Date - Sep 06 , 2026 | 10:28 PM
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదల చిత్ర యూనిట్‌ను కలవరపెట్టే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్, సక్సెస్ ల్యాండ్‌మార్క్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'జనవరి 12 విడుదలస (January 12 Vidudala). విక్టరీ వెంకటేష్ (Venkatesh), నందమూరి కళ్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోలుగా నటిస్తున్న ఈ భారీ చిత్రంపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ను సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నాయి. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వెంకీ, కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్స్ సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకోగా, రీసెంట్‌గా అనిల్ రావిపూడి తన మార్క్ కామెడీతో చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ సినిమాపై అంచనాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
అయితే సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న తరుణంలో, చిత్ర యూనిట్‌ను కలవరపెట్టే ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం మైసూర్‌లో జరుగుతున్న ఒక కీలక షెడ్యూల్‌లో చిత్రీకరిస్తున్న ఒక హుషారైన పాట తాలూకు విజువల్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఆడియో క్లియర్‌గా లేకపోయినా, మంచి క్వాలిటీ ఫోన్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో కావడంతో సీన్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ప్రముఖ దేవాలయంలో జరిగే సంబరం నేపథ్యంలో ఈ పాట ఉంటుందని, సినిమాకు ఇదొక మేజర్ హైలైట్ సాంగ్ అవుతుందని అర్థమవుతోంది.
మరీ ముఖ్యంగా ఈ పాటలో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌లతో పాటు హీరోయిన్లు కీర్తి సురేష్ (Keerthy Suresh), కృతి శెట్టి (Krithi Shetty), ప్రముఖ హాస్యనటుడు రఘుబాబు వంటి ముఖ్య నటీనటులంతా పాల్గొనడం విశేషం. మెయిన్ క్యాస్టింగ్ అందరూ పాల్గొన్న ఒక భారీ సాంగ్ విజువల్స్ ఇలా ముందే బయటకు రావడంతో, థియేటర్లలో చూడాల్సిన ఆ మ్యాజిక్ మిస్ అవుతుందేమోనని, సినిమా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుందేమోనని అభిమానులు తీవ్రంగా కంగారు పడుతున్నారు.
అయితే ఇలాంటి లీకుల వల్ల దర్శకుడు అనిల్ రావిపూడి ఏమాత్రం అధైర్యపడే రకం కాదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. గతంలోనూ ఆయన సినిమాల షూటింగ్ సమయంలో ఇలాంటి చిన్నచిన్న అవాంతరాలు ఎదురైనా, తన మేజిక్ టచ్‌తో సినిమా రిజల్ట్‌ను పూర్తిగా మార్చేసిన చరిత్ర ఆయనది. ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా అధిగమించి, తన సినిమాను ప్రేక్షకుల్లోకి సరిగ్గా ఎలా తీసుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. పైగా ప్రస్తుతం ట్రెండ్ మారిన నేపథ్యంలో, పబ్లిక్ లొకేషన్లలో షూటింగ్ చేస్తున్నప్పుడు లీకులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఎంత భద్రత ఏర్పాటు చేసినప్పటికీ, కేవలం టాలీవుడ్ భారీ ప్రాజెక్టులకే కాకుండా పాన్ ఇండియా సినిమాలకు కూడా ఈ లీకుల తిప్పలు తప్పడం లేదు.
చుట్టుపక్కల దూరంగా ఉండి సెల్‌ఫోన్లలో రికార్డ్ చేసే వారిని పూర్తిగా నియంత్రించడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. ఒక చిన్న క్లిప్ సోషల్ మీడియాలోకి వచ్చిందంటే, అది డిలీట్ అయ్యేలోపే లక్షలాది మందికి చేరిపోవడం సర్వసాధారణమైపోయింది. ఇది ఒక పాట క్లిప్ కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకపోయినా, రాబోయే రోజుల్లో సినిమాలోని కీలకమైన ఎమోషనల్ సీన్లు, ట్విస్టులు లీక్ కాకుండా మేకర్స్ మరింత కఠినమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనప్పటికీ, ఈ చిన్నపాటి లీకులు సినిమాపై ఉన్న హైప్‌ను ఏమాత్రం తగ్గించలేవనేది ట్రేడ్ వర్గాల అంచనా. పైగా ఇవన్నీ సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి తప్ప, క్రేజ్‌ను తగ్గించడం లేదు. మరి వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ క్రేజీ మల్టీస్టారర్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.