Varnasi: రాజమౌళి ఎక్క‌డా.. త‌గ్గ‌డం లేదుగా

ABN , Publish Date - Sep 07 , 2026 | 08:54 AM

మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసిపై అంచనాలు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉన్నాయి.

varanasi

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి (Varanasi) పై తాజాగా భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. తనకు అడ్వెంచర్ సినిమాలు ఇష్టమని తెలిపిన జక్కన్న, ఆఫ్రికా నుంచి అంటార్కిటికా ప్రయాణం, టైమ్ ట్రావెల్ వంటి అద్భుతమైన అంశాలతో ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ఇంటర్నేషనల్ మీడియాతో తెలిపారు.

కేవలం సాహసాలతోనే కాకుండా తండ్రీకొడుకుల మధ్య నడిచే ఒక అందమైన భావోద్వేగం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని ఆయన వెల్లడించారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ భారీ ఐమ్యాక్స్ చిత్రాన్ని కార్తికేయ, కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న అత్యంత గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated Date - Sep 07 , 2026 | 09:51 AM