సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తి.. త్వరలో విడుదల

ABN, Publish Date - Oct 17 , 2026 | 05:59 PM

పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ షూటింగ్ పూర్తయింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Slumdog Movie

డైనమిక్ ఫిల్మ్‌మేకర్ పూరి జగన్నాథ్, వెర్సటైల్ హీరో విజయ్ సేతుపతి పాన్-ఇండియా యాక్షన్ డ్రామా 'స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్' షూటింగ్ పూర్తయింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన చివరి షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తం ముగిసింది. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఏర్పడింది. పవర్ ఫుల్ కథలు, తనదైన స్క్రీన్ ప్రజెంటేషన్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పూరి జగన్నాథ్‌.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని ఛార్మి తెలిపారు. ఇప్పటివరకు విడుదలైన పాత్రల పరిచయ వీడియోలు సినిమాలోని విభిన్న పాత్రల స్వభావాలను పరిచయం చేశాయి. త్వరలోనే సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్న మేకర్స్‌.. ప్రమోషనల్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నారు. సినిమా విడుదల తేదీని కూడా త్వరలో ప్రకటించనున్నారు.


ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, టబు, దునియా విజయ్, జరీనా వహాబ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ బాధ్యతలను శ్యామ్‌ కె. నాయుడు నిర్వహిస్తుండగా, హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. సంతోష్ నూజిల్లా ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. అనిల్ పడూరి విజువల్ ఎఫెక్ట్స్‌ పర్యవేక్షిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

‘కల్కి 2’ షూటింగ్‌పై అప్‌డేట్.. సాయిపల్లవి ఎంట్రీపై టాక్

దీపావళి రేసులో సూర్య, నయనతార.. విజేత ఎవరు?

‘బాషా’, ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత

Updated Date - Oct 17 , 2026 | 06:06 PM