సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Director: సితారలో 'సింగ్ గీతం' శాలిని!

ABN, Publish Date - Jul 20 , 2026 | 04:50 PM

'సింగ్‌ గీతం'లో రేణు పాత్రతో మెప్పించిన యువ నటి శాలినీ కొండేపూడి త్వరలో దర్శకురాలు కాబోతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ ఆమెతో సినిమా నిర్మించ బోతున్నట్టు సమాచారం.

Shalini Kondepudi

ప్రఖ్యాత దర్శకులు సింగీతం శ్రీనివాస రావు తెరకెక్కించిన 'సింగ్‌ గీతం' చిత్రం జూన్ 12న తెలుగులోనూ, 26న తమిళంలోనూ విడుదలైంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది. అందులో కాస్తంత నెగెటివ్‌ షేడ్స్ ఉన్న రేణు అనే పాత్రను పోషించి, మంచి గుర్తింపు తెచ్చుకుంది శాలిని కొండేపూడి. మీడియా నుంచి ఫిల్మ్ రైటర్ గా మారిన శాలిని మంచి నటి కూడా. కొన్ని వెబ్ సీరిస్ తో పాటు 'మై డియర్ దొంగ, జయమ్మ పంచాయితీ, శుభం' వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది. ఇందులో కొన్ని సినిమాల రూపకల్పనలోనూ తనవంతు సహాయ సహకారాలు అందించింది.


మొదటి నుంచి డైరెక్టర్ కావాలన్న శాలిని కోరిక త్వరలోనే నెరవేరబోతోంది. 'సింగ్‌ గీతం' మూవీ విడుదల సమయంలోనే తన నెక్ట్స్ టార్గెట్ డైరెక్షన్ అని చెప్పేసిందామె. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ శాలిని ని దర్శకురాలిగా పరిచయం చేస్తోందని తెలుస్తోంది. అన్ని వర్గాలనూ అలరించేలా ఓ మంచి కుటుంబ కథా చిత్రాన్ని ఎంటర్ టైన్ మెంట్ వే లో శాలిని తెరకెక్కించ బోతోందట. శాలిని చెప్పిన కథ నచ్చి సూర్యదేవర నాగవంశీ ప్రాజెక్ట్ కు పచ్చ జెండా ఊపారని సమాచారం. అలనాటి నటి భానుమతి నుంచి పలువురు నటీమణులు దర్శకత్వం కూడా వహించి, తమ సత్తాను చాటారు. శాలినీ కొండేపూడి దర్శకురాలిగానూ విజయం సాధిస్తే... భానుమతి, సావిత్రి, విజయనిర్మల, జీవిత తదితరుల సరసన నిలుస్తారు.

ఇవి కూడా చదవండి:

ఒకడు 5 సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు.. సిల్క్ స్మిత సూసైడ్ లెటర్ వైరల్

మెగా ఫ్యామిలీ అని గర్వంగా చెప్పుకుంటున్నా: నిహారిక

చిరు, బాలయ్య చొరవతో ముగిసిన డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం

Updated Date - Jul 20 , 2026 | 04:53 PM