సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సీనియర్‌ దర్శకుడు రవిచంద్ర కన్నుమూత

ABN, Publish Date - Sep 24 , 2026 | 06:11 AM

ప్ర‌ముఖ టాలీవుడ్‌ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు రవిచంద్ర కన్నుమూశారు.

Ravichandra

హీరో కృష్ణ నటించిన ‘రౌడీ నంబర్‌ వన్‌’, ‘కిరాయిగూండా’, ‘సార్వభౌముడు’, ‘దొరగారికి దొంగపెళ్లాం’, బాలకృష్ణ నటించిన ‘దేశోద్ధారకుడు’, ‘అశోక చక్రవర్తి’, వెంకటేశ్‌ నటించిన ‘అగ్గిరాముడు’, ‘విజేత విక్రమ్‌’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఎస్‌.ఎస్.రవిచంద్ర (Ravichandra) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు.

84 ఏళ్ల వయసు కలిగిన సారిక సత్య రవిచంద్ర స్వగ్రామం పాలకొల్లు. సీనియర్‌ దర్శకులు కమలాకర కామేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు, కె.రాఘవేంద్రరావు దగ్గర అసోసియేట్‌కు పని చేసిన రవిచంద్రను జితేంద్ర నటించిన హిందీ ‘ఖైదీ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేశారు హీరో కృష్ణ.

రజనీకాంత్‌ నటించిన ‘మహాగురు’ సినిమా సహా మొత్తం ఆరు హిందీ చిత్రాలకు, ఓ కన్నడ చిత్రానికి రవిచంద్ర దర్శకత్వం వహించారు. ఆయనకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. నేడు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని రవిచంద్ర సోదరుడు, నటుడు సారిక రామచంద్రరావు తెలిపారు.

Updated Date - Sep 24 , 2026 | 06:11 AM