యంగ్‌ లుక్‌లో మహేశ్‌?.. ‘వారణాసి' షూటింగ్ పూర్తి

ABN , Publish Date - Sep 24 , 2026 | 07:46 AM

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి చిత్రంలో మహేశ్‌బాబు తన షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేశారనేది సమాచారం.

Varanasi

మహేశ్‌బాబు ( Mahesh Babu) కథానాయకుడిగా రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కిస్తున్న యాక్షన్‌ అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ ‘వారణాసి’ (Varanasi Movie). దుర్గా ఆర్ట్ప్‌పై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తన షూటింగ్‌ పార్ట్‌ను మహేశ్‌ పూర్తి చేశారనేది తాజా సమాచారం.

ఇప్పుడు ఈ సినిమాలో ఆయన లుక్‌ గురించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా శారీరకంగా పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు ఆయన. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆయన 24 ఏళ్ల కుర్రాడిగా కనిపించనున్నారనేది లేటెస్ట్‌ టాక్‌.

ఎటువంటి డూప్‌, ఏఐ సహాయం లేకుండానే మహేశ్‌ ఈ సన్నివేశాల్లో నటించారట. థియేటర్లో ఈ సీన్స్‌ వచ్చేటప్పుడు ప్రేక్షకులు కచ్చితంగా ఆశ్చర్యానికి లోనవుతారని చిత్రయూనిట్‌ భావిస్తోంది. వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 7న ‘వారణాసి’ విడుదలవుతోంది.

Updated Date - Sep 24 , 2026 | 07:46 AM