సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sampath Nandi: ఇప్పటివరకు శర్వా బెస్ట్ చూశారు.. ఇక బీస్ట్ చూస్తారు

ABN, Publish Date - Nov 23 , 2026 | 07:40 PM

చార్మింగ్ స్టార్ శర్వా తన ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’తో రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. మాస్ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం నవంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Director Sampath Nandi

చార్మింగ్ స్టార్ శర్వా (Sharwa) తన ప్రతిష్టాత్మక చిత్రం ‘భోగి’ (Bhogi)తో రగ్గడ్, ఇంటెన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. మాస్ దర్శకుడు సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ని ఏర్పడేలా చేసింది. నవంబర్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ.. టీజర్ రిలీజ్ అయిన తర్వాత విష్ చేసిన మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్, సాయి దుర్గ తేజ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరూ సినిమాను అభినందించారు. వాళ్లందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇది సంక్రాంతికి ముందు వచ్చే ‘భోగి’ కాదు. చెడును చంపిన తర్వాత వచ్చే ‘భోగి’. బొగ్గులకుంట అనే గ్రామంలో చాలా కాలంగా ఉన్న బానిసత్వాన్ని, కొన్ని నమ్మకాలను మంటలో వేసి కొత్త వెలుగును నింపే క్యారెక్టర్‌లో శర్వా ఇందులో కనిపిస్తారు. తెలంగాణలోని బొగ్గులకుంట గ్రామంలో జరిగే కథ ఇది. ఈ ప్రపంచమంతా ఎమోషన్ చుట్టూ తిరుగుతుంది. అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే అద్భుతమైన అనుబంధం చుట్టూ రాసుకున్న కథ ‘భోగి’.


ఈ సినిమా కోసం ఒక కొత్త దర్శకుడిలా పనిచేశాను. నేను ఈ సినిమా కోసం రోజుకు 16 గంటలు పనిచేస్తే, నా టీమ్ 20 గంటలు పనిచేసింది. ఈ కథను నేను కేవలం చార్మింగ్ స్టార్ శర్వానంద్‌కు మాత్రమే చెప్పాను. ఆయనకు తప్ప మరొకరితో షేర్ చేసుకోలేదు. కథ విన్న వెంటనే ఆయన ఓకే చేశారు. అలా మొదలైన మా ప్రయాణం దాదాపు మూడేళ్లు కొనసాగింది. ఆయన ఇండియాలోనే ఉన్న ఫైనెస్ట్ యాక్టర్స్‌లో ఒకరు. ఈ సినిమాలో సర్‌ప్రైజ్ ప్యాకేజీ ఉంటుంది. శర్వా క్లోజప్ షాట్స్ అద్భుతంగా ఉంటాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్‌లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. అంత అద్భుతంగా నటించారు. ఈ సినిమాతో శర్వాకు నేషనల్ అవార్డు రావాలి. అంత అద్భుతంగా చేశారు. ‘భోగి’ చూసిన తర్వాత శర్వానంద్ ఫోన్ చేసి.. ‘మా అమ్మ నాకు జన్మనిస్తే, మీరు నాకు మరో జన్మనిచ్చారు’ అని చెప్పారు. ఒక డైరెక్టర్‌కు ఒక హీరో ఇలా చెప్పే మాటకంటే గొప్ప అవార్డు ఉండదు. ఆ రోజే నేను సక్సెస్ అయిపోయాను. ఇప్పటివరకు శర్వానంద్ బెస్ట్ చూశారు. ఈ సినిమాలో ఆయనలోని బీస్ట్‌ని చూస్తారు. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమా చేశాడనే దృష్టితో చూడండి. మీకు నచ్చితే పదిమందికి చెప్పండి’’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి:

ఫ్యామిలీ ప్యాక్ టీజర్.. గుర్తింపు కథలు వద్దురా.. బయట చెక్కేస్తున్నారు

లైన్‌లోకి వచ్చిన ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. రిలీజ్ ఎప్పుడంటే

భారత్ - పాక్ సైనికులతో.. ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్ వైరల్

Updated Date - Nov 23 , 2026 | 07:40 PM