‘భోగి’ ట్రైలర్.. ఘడియలు దగ్గర పడ్డాయ్.. గంగా గాడి కోత మొదలు

ABN , Publish Date - Nov 22 , 2026 | 09:23 PM

చార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా ఊరమాస్, రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. మాస్ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ వదిలారు.

Bhogi Trailer Review

చార్మింగ్ స్టార్ శర్వా (Sharwa) పూర్తిగా ఊరమాస్, రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ (Bhogi). మాస్ డైరెక్టర్ సంపత్ నంది (Sampath Nandi) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా, ఆదివారం జరిగిన ప్రీ-రిలీజ్ వేడుకలో చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 3 నిమిషాల 6 సెకన్ల నిడివితో సాగిన ఈ ట్రైలర్ ఆద్యంతం గూస్‌బంప్స్ తెప్పిస్తూ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. థియేటర్లలో శర్వా మాస్ అవతారం ఏ రేంజ్‌లో ఉండబోతుందో.. ఈ ట్రైలర్ హింట్ ఇచ్చేసింది. ఈ ట్రైలర్‌ని గమనిస్తే.. (Bhogi Trailer Review)


1960ల నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం నేపథ్యంలో రా అండ్ రస్టిక్‌గా ట్రైలర్ మొదలైంది. చీకట్లో జీపు లైట్ల వెలుతురులో ‘‘ఏదో చూసినవంట.. ఏదో ఆపినవంట.. చీకట్ల తోటల చూసింది చీకట్లనే కలిసిపోవాలె’’ అనే పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆరంభం నుంచే ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ఒకవైపు ఐదుగురు చెల్లెళ్లకు అన్నయ్యగా, ఆ ఇంటికి పెద్దదిక్కుగా ఉండే గంగా ప్రేమ, కుటుంబ భావోద్వేగాలను హృద్యంగా చూపిస్తూనే.. మరోవైపు ‘ఈ ఇంట్లో మీ అన్నకు గండం గోచరిస్తాందే తల్లి’ అనే హెచ్చరికతో కథ మలుపు తిరుగుతుంది.

‘చీకట్లో తోటలో జరిగేదాని వెనకాల ఏదో చీకటుంది బావ’ అనే డైలాగ్ ఒక్కటి చాలు.. ఈ సినిమా నేపథ్యం ఏమిటో చెప్పడానికి. ఇదే ఈ సినిమాకు ప్రధాన బలం అనేలా ట్రైలర్ తెలియజేస్తుంది. ‘పంట మనదైనా పండితే కొయ్యాలె.. మనిషి మనోడైనా పంతానికి కత్తెయ్యాలె’, ‘భోగి ఘడియలు దగ్గరపడ్డాయి.. మన చిరకాల కల నెరవేరుతుంది’ అనే విలనిజాన్ని లేపుతూనే.. ‘ఈ రాత్రికి కోత నాది.. లెక్క మీది’ అంటూ మంటల మధ్య నుంచి శర్వా వచ్చే ఎలివేషన్ సీన్లు, పదునైన కొడవళ్లతో సాగే రక్తపాతం ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇందులో అనుపమ పరమేశ్వరన్ డీ-గ్లామర్, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తూ ‘వాడు బొగ్గుల పుట్టిండు.. గుగ్గిలో పెరిగిండు.. వాడికి కొలిమి అంటించుడు తెలుసు, కొరివి పెట్టుడూ సుధ తెలుసు’ అని చెప్పే డైలాగ్ శర్వా పాత్రలోని భీకర రూపాన్ని ఆవిష్కరించింది. అలాగే డింపుల్ హయాతి ‘గంగా.. ఈ ** కొడుకుని ఇడిసిపెట్టు’ అంటూ పలికిన పవర్‌ఫుల్ డైలాగ్ మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉంది.


ఇక దర్శకుడు సంపత్ నంది తన కెరీర్‌లోనే అత్యంత రా అండ్ ఇంటెన్స్ కథను ఎంచుకున్నట్లు ట్రైలర్ చూస్తుంటే స్పష్టమవుతోంది. ఎ. కిశోర్ కుమార్ విజువల్స్ 1960ల నాటి పీరియడ్ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఇక భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కు ప్రాణం పోసింది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో ‘చిన్న పిల్లలు ఏడ్చి మర్చిపోతారు.. పెద్దోళ్లు మర్చిపోలేక ఏడుస్తారు.. ఎన్ని జన్మలు ఏడిస్తే మా ఏడుపు చల్లారుతుంది’ అంటూ శర్వా పలికిన ఎమోషనల్ డైలాగ్ గుండెను బరువెక్కిస్తుంది. మొత్తం మీద సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్, ఎమోషన్, మాస్ ఎలివేషన్ల కలయికతో వచ్చిన ‘భోగి’ ట్రైలర్ నవంబర్ 27న బాక్సాఫీస్ వద్ద గంగా గాడి కోత ఏ రేంజ్‌లో ఉండబోతోందో శాంపిల్ చూపించేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకెళుతోంది.

ఇవి కూడా చదవండి:

ఎవరిపైనైనా క్రష్ ఉందా? అంటే.. మీనూ పాప షాకింగ్ ఆన్సర్

‘వృషకర్మ’ రిలీజ్ పై డౌట్స్ వద్దు.. ఇదిగో క్లారిటీ

ఆదర్శ కుటుంబం.. ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేది ఎప్పుడు?

Updated Date - Nov 22 , 2026 | 09:23 PM

Bhogi: విడుదలకు సిద్ధం అవుతున్న భోగి

Bhogi: ఏముందిరా పాట‌.. ఆహా! మేదారి న‌ర్స‌న్న‌, క‌మ్మారి గంగ‌న్న, గొల్లోళ్ళ సులోచన

Bhogi: నెత్తుటితో అలకకపోతే.. ఆసక్తికరంగా భోగి టీజర్

Bhogi: భారీ సెట్‌.. హై ఆక్టేవ్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణలో 

Bhogi: భీమ్స్ ను తప్పించారా... తప్పుకున్నాడా...