భారత్ - పాక్ సైనికులతో.. ‘ది ఇండియన్ బార్డర్’ పోస్టర్ వైరల్
ABN , Publish Date - Nov 23 , 2026 | 04:17 PM
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’. ఈ మూవీ నుంచి న్యూ పోస్టర్ విడుదలైంది.
దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన చిత్రం ‘ది ఇండియన్ బార్డర్’ (The Indian Border). ఆర్ట్ ఇన్ హార్ట్ క్రియేషన్స్ (Art In Heart Creations) బ్యానర్‌పై నివేద్య రెడ్డి నిర్మాణంలో, డి.ఎస్. బాషా కథనం, మాటలు, దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో కిరణ్ యార్లగడ్డ (Kiran Yarlagadda), ఆదర్శ్, సీనియర్ నటుడు మురళీ మోహన్, మేఘా శ్రీ, సింధు తులాని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు అన్నీ పూర్తవడంతో, త్వరలోనే గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. పోస్టర్ మధ్యలో పదునైన ముళ్ల కంచె ఉండగా.. ఒకవైపు భారత జెండా రెపరెపలాడుతుండగా, భారత ఆర్మీ యూనిఫామ్‌తో మన సైనికుడు ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జెండా నేపథ్యంలో పాక్ సైనికుడు గంభీరంగా కనిపిస్తున్నాడు. ఇద్దరు సైనికుల ముఖాలను, హెల్మెట్‌పై ఉన్న ఇరు దేశాల అధికారిక చిహ్నాలను ఒకే ఫ్రేమ్‌లో అద్భుతంగా డిజైన్ చేసిన విధానం సినిమాలోని ఉత్కంఠకు అద్దం పడుతోంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఈ సినిమా ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ కె మ్యూజిక్ సొంతం చేసుకోగా, ఇటీవల విడుదలైన ‘జిందా రహేన్ తో డ్యూటీ’ పాట చార్ట్‌బస్టర్‌గా నిలిచి మంచి స్పందన రాబట్టుకుంది. కిరణ్ యార్లగడ్డ కథ అందించిన ఈ చిత్రానికి ఆనంద్ మంత్ర సంగీతం సమకూర్చారు. నలినికాంత్ కొండపల్లి సినిమాటోగ్రఫీ అందించగా, కె. రమేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. హర్నాథ్ సింగులూరి, గౌరీ శంకర్ నడిపల్లి సాహిత్యం అందించారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ప్రమోషనల్ అప్డేట్లు, విడుదల తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ దర్శకుడితో ఫహాద్ ఫాజిల్ క్రేజీ ప్రాజెక్ట్.. బిగ్ సర్ప్రైజ్ ఎప్పుడంటే
సంక్రాంతి పరీక్ష.. కృతి కెరీర్ మలుపు తిరుగుతుందా..
నాకు లైఫ్ ఇచ్చింది తెలుగు సినిమా ఇండస్ట్రీనే..: రకుల్