సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బంగారం నేను కాదు.. సాయిపల్లవి -సమంత

ABN, Publish Date - Jun 06 , 2026 | 09:51 PM

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ సమంత ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు.

Samantha and Sai Pallavi

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై సమంత (Samantha), రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). సమంత ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి నందినీ రెడ్డి (Nandini Reddy) దర్శకురాలు. ఈ మూవీ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్.. భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్‌లో హీరోయిన్ సమంత యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఓ వీడియోలో.. అసలు బంగారం తను కాదని, సాయిపల్లవి (Sai Pallavi) అని తెలిపారు. అసలు వీడియోలో సమంత ఏం తెలిపారంటే..


‘‘నిజానికి ఈ సినిమాను నేను సెలెక్ట్ చేసుకోలేదు.. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ముఖ్య ఉద్దేశం ఎప్పుడూ కూడా మహిళా ప్రాధాన్యత ఉన్న కథలపైనే దృష్టి పెట్టడం. ఈ సినిమాకు సంబంధించిన మొదటి మేమంతా సాయిపల్లవిని అనుకున్నాం. ఈ కథని ఆమెకి చెప్పి, ఇందులో నటింపజేయాలని అనుకున్నాం. కానీ ఆమె చాలా చాలా బిజీగా ఉండటంతో, ఈ సినిమాకు ఆమె డేట్స్ కేటాయించలేదని మాకు తెలిసింది.


దీంతో ఈ కథని నేనే చేయాల్సి వచ్చింది. నాకోసమని ఈ కథను కొద్దిగా మార్చారు. ‘మా ఇంటి బంగారం’ సినిమా బాగా వర్కవుట్ అవుతుందని ఆశిస్తున్నాను. అలాగే భవిష్యత్తులో మరికొంతమంది మహిళా నటీమణులు మా ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్‌ పై నమ్మకంతో మాతో కలిసి పనిచేస్తారని నమ్ముతున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ‘మా ఇంటి బంగారం’ విషయానికి వస్తే.. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీలో.. దిగంత్, గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు.

ఇవి కూడా చదవండి:

నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!

ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!

సినిమా రివ్యూ: హీమాన్ అండ్‌ మాస్టర్స్ ఆఫ్ ది యూనివ‌ర్స్

Updated Date - Jun 06 , 2026 | 09:51 PM