సాయితేజ్‌ సినిమాలో కాంతార భామ

ABN , Publish Date - Oct 25 , 2026 | 08:48 AM

సాయిదుర్గా తేజ్‌ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సై అన్న సంగతి తెలిసిందే. దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు.

సాయిదుర్గా తేజ్‌ (Sai Durga Tej) మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సై అన్న సంగతి తెలిసిందే. దర్శకుడు తేజ కాకుమాను తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. ఇటీవల  ఈ సినిమాను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అటవీ నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా రూపొందనుందని ఆ వార్త సారాంశం. అడవి వాతావరణం, అక్కడి పరిస్థితుల చుట్టూ కథ నడుస్తుందని, యాక్షన్‌ సన్నివేశాలతో పాటు విజువల్‌ ఎఫెక్ట్స్‌కు  చిత్రబృందం అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

కాంతారా ఫేమ్.. కథానాయికగా

‘కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సప్తమి గౌడ ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి  అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే కనుక నిజమైతే తేజ్ తో తొలి సినిమా అవుతుంది. 'తమ్ముడు'  చిత్రం తర్వాత తెలుగులో సప్తమి  చేస్తున్న రెండో సినిమా అవుతోంది. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

ఈ నెలాఖరు నుంచే చిత్రీకరణ!

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు నుంచే చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. షూటింగ్‌ షెడ్యూల్స్‌, చిత్రీకరణ ప్రదేశాలపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం  సాయిదుర్గా తేజ్‌ నటించిన ‘సంబరాల ఏటి గట్టు’ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.  

Updated Date - Oct 25 , 2026 | 09:28 AM