ప్రియాంక పేరు వాడుకుంటే ఇంకోలా ఉండేది: పరిణీతి చోప్రా
ABN , Publish Date - Oct 25 , 2026 | 01:09 PM
బాలీవుడ్‌లో తనదైన విలక్షణ నటనతో, సహజ సిద్ధమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో పరిణీతి చోప్రా ఒకటి. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ తనకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకున్న ఆమె.. తాజాగా తన కెరీర్, ఎదుర్కొన్న ఒడిదొడుకులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
బాలీవుడ్‌లో తనదైన విలక్షణ నటనతో, సహజ సిద్ధమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో పరిణీతి చోప్రా (Parineeti Chopra) ఒకటి. సినీ నేపథ్యం ఉన్నప్పటికీ తనకంటూ సొంత గుర్తింపును ఏర్పరచుకున్న ఆమె.. తాజాగా తన కెరీర్, ఎదుర్కొన్న ఒడిదొడుకులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2011లో ప్రతిష్టాత్మక యశ్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ‘లేడీస్ వర్సెస్ రిక్కీ బహల్’ చిత్రంతో ఆమె సినీ అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘ఇషాక్‌జాదే’, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, అక్షయ్ కుమార్ సరసన నటించిన ‘కేసరి’, అలాగే ఇటీవల విమర్శకుల ప్రశంసలు అందుకున్న బయోపిక్ డ్రామా ‘అమర్‌సింగ్ చమ్‌కీలా’ వంటి చిత్రాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. తన ప్రయాణాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో విచిత్రంగా, మరెంతో అందంగా కనిపిస్తుందని, ప్రతి సినిమా తనలోని నటిని మరింత పరిపూర్ణం చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమలో ఎవరి అండదండలు లేకుండా సొంత కాళ్లపై నిలబడటానికే తాను మొదటి నుంచి ప్రాధాన్యమిచ్చానని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
ఇదే సమయంలో తన కుటుంబానికి చెందిన గ్లోబల్ స్టార్, అక్క ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి ప్రస్తావిస్తూ ఆమె సంచలన విషయాలను పంచుకున్నారు. సినీ వర్గాల్లోనూ, బయటా చాలామంది ప్రియాంక చోప్రా గురించి తనను అడుగుతుంటారని పరిణీతి తెలిపారు. ప్రియాంక తనకు కేవలం పెద్దమ్మ కూతురు మాత్రమే కాదని, జీవితంలో ఒక మంచి మార్గదర్శకురాలని కొనియాడారు. అయితే, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత తనకు దక్కిన విజయాలైనా, ఎదురైన పరాజయాలైనా పూర్తిగా తన వ్యక్తిగతమైనవేనని స్పష్టం చేశారు. వాటి వెనుక ప్రియాంక ఎలాంటి సిఫార్సులు లేవని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్, స్టార్‌డమ్ ఉన్న ప్రియాంక పేరును వాడుకుని అవకాశాలు అందుకోవాలని, ఆమె పలుకుబడితో కెరీర్‌ను సులభంగా నిర్మించుకోవాలని తాను ఏనాడూ భావించలేదని పరిణీతి కుండబద్దలు కొట్టారు.
ఒకవేళ తాను కనుక ప్రియాంక చోప్రా పేరును ఉపయోగించుకుని, ఆమె రికమండేషన్లతో అవకాశాలు దక్కించుకుని ఉంటే తన కెరీర్‌లో ఇన్ని ఫ్లాప్ సినిమాలు ఉండేవి కావని, తన పరిస్థితి పూర్తిగా ఇంకోలా ఉండేదని పరిణీతి నిర్మొహమాటంగా వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలో తన జర్నీ కేవలం తన సొంత కష్టం, స్వయంకృషితోనే సాగిందని ఆమె పేర్కొన్నారు. ప్రియాంకకు తనకు మధ్య వ్యక్తిగతంగా ఎంతో ప్రేమానురాగాలు, బలమైన కుటుంబ బంధం ఉన్నప్పటికీ.. వృత్తిపరంగా ఎదురైన సవాళ్లు, ఆటుపోట్లను మాత్రం తాను స్వయంగా ఎదుర్కొంటూనే ఈ స్థాయికి చేరుకున్నానని వెల్లడించారు. నెపోటిజం, సిఫార్సుల ప్రభావం ఎక్కువగా ఉండే బాలీవుడ్‌లో.. అంత పెద్ద స్టార్ బంధువు ఉన్నప్పటికీ ఎవరి సాయం తీసుకోకుండా తన కాళ్లపై తాను నిలబడ్డానని పరిణీతి చోప్రా చెప్పిన తీరు సినీ వర్గాల్లోనూ, నెటిజన్లలోనూ ప్రశంసలు అందుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
‘ఫౌజీ’ పవర్‌ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్
థియేటర్లలో ముగిసి.. ఓటీటీకి వచ్చాకా ట్రోలింగ్! దర్శకులకు నిద్రలేని రాత్రులు
మినిమమ్ సెన్స్ లేకుండా నెగిటివ్ చేయాలని చూశారు: ‘రణబాలి’ దర్శకుడు