చార్ట్‌బస్టర్‌గా.. ‘రాయవలస’లోని ‘రింగుడు రింగుడు పిల్ల’
ABN, Publish Date - Oct 14 , 2026 | 06:02 PM
రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ‘రాయవలస’ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళుతోంది.
గ్రామీణ జీవన నేపథ్యంతో, యథార్థ సంఘటనల స్ఫూర్తితో రూపొందుతోన్న విభిన్న కథా చిత్రం ‘రాయవలస’ (Rayavalasa). రేసన్ ప్రొడక్షన్స్ పతాకంపై గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై దర్శకురాలు రాధిక జయంతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అమెరికా నుంచి టాలీవుడ్లోకి అడుగుపెడుతున్న కార్తీక్ జయంతి ఈ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుండగా, శ్రీషా నులు హీరోయిన్గా ‘రాణి’ పాత్రలో తన సహజ నటనతో అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్.. అద్భుతమైన స్పందనను రాబట్టుకోగా, తాజాగా విడుదలైన ‘రింగుడు రింగుడు’ (Ringudu Ringudu) సాంగ్ యూట్యూబ్‌లో దూసుకుపోతూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
అర్జున్ బాల అందించిన సంగీతం, నేటివిటీ ఉట్టిపడే సాహిత్యం, ధనుంజయ్ వంటి ప్రముఖ గాయకుల గళం తోడవడంతో ‘రింగుడు రింగుడు’ పాటకు నెటిజన్ల నుంచి విశేష ఆదరణ దక్కుతోంది. క్యాచీ ట్యూన్‌తో శ్రోతలను ఉర్రూతలూగిస్తున్న ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం రీల్స్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంతో పాటు సంగీత రంగానికి, కొత్త ప్రతిభావంతులకు వేదిక కల్పించాలనే ఉద్దేశంతో హీరో కార్తీక్ జయంతి ‘రేసన్ రికార్డ్స్’ పేరిట సొంత మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ప్రముఖ నిర్మాత వంశీ నందిపాటి చేతుల మీదుగా ఈ ఛానల్ ప్రారంభమైంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణులంతా కలసి.. సినిమా మొత్తాన్ని సింగిల్ షెడ్యూల్లోనే పూర్తి చేయడం విశేషం.
ఈ సినిమాకు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. అర్జున్ బాల సంగీతం సమకూర్చగా.. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ లిరిక్స్ అందించారు. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి తదితరులు పాటలను ఆలపించారు. ఈ చిత్రానికి వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటున్న ‘రాయవలస’ చిత్ర విడుదల తేదీపై త్వరలోనే అధికారికంగా స్పష్టత ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. మంచి కంటెంట్, అదిరిపోయే పాటలతో రాబోతోందని మేకర్స్ చెబుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి..
ఇవి కూడా చదవండి:
Jailer 2: సంతానం సీన్లన్నీ ఔట్.. విజయ్ సేతుపతి పాత్ర ‘జైలర్ 3’కి లీడ్..
సెట్లో ప్రమాదం.. ఇమ్రాన్ హష్మీకి తప్పిన ప్రాణాపాయం
సితార ఎంటర్టైన్మెంట్స్ సినిమాల విడుదల వాయిదా