కన్నడలోకి సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్ భగీరథ నవల!

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:34 PM

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ భగీరథ రచించిన చారిత్రక నవల ‘నాగలాదేవి’ కన్నడంలోకి అనువాదమైంది. హంపీలోని విరూపాక్ష దేవాలయంలో ప్రొ. ఎం. మునిరాజు ఈ నవలను ఆవిష్కరించారు.

Nagaladevi Novel in Kannada

సీనియర్‌ ఫిల్మ్ జర్నలిస్ట్ భగీరథ రాసిన చారిత్రక నవల 'నాగలాదేవి' కన్నడలోకి అనువాదమైంది. ఇటీవల హంపీలోని విరూపాక్ష దేవాలయంలో 'నాగలాదేవి' కన్నడ నవల ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీగంగ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ సంస్థ నిర్వహించింది. 'నాగలాదేవి' కన్నడ నవలను విజయనగర శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కులపతి ప్రొ. ఎం. మునిరాజు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 'ప్రపంచంలో శిల్పకళా వారసత్వంలో విజయనగర సామ్రాజ్యంకు సముచితమైన స్తానం ఉందని, శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణ యుగమని, అలాంటి రాయలవారి ప్రేమకథను 'నాగలాదేవి ' పేరుతో గ్రంథస్థం చెయ్యడం సంతోషంగా ఉంద'ని అన్నారు. ఈ సందర్భంగా భగీరథను, ఈ నవలను కన్నడలో అనువదించిన డాక్టర్ దేవన్నను ఆయన అభినందించారు .


రచయిత భగీరథ మాట్లాడుతూ, 'కృష్ణదేవరాయలు, నాగలాదేవి నడయాడిన విరూపాక్ష దేవాలయంలో ఈ కార్యక్రమం జరగాలని నేను అనుకున్నాను. దానిని దేవన్న నెరవేర్చారు. కన్నడంలో కూడా ఈ నవల పండిత పామరుల అభిమానం సంపాదిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ నవల రాయడం కోసం 15 సంవత్సరాలు పరిశోధన చేశాను. శాసనాల ఆధారంగా దీనిని రాయడం జరిగింది' అని అన్నారు. ఈ నవలను కన్నడలో అనువదించే అవకాశం ఇచ్చిన భగీరథకు డాక్టర్ దేవన్న ధన్యవాదాలు తెలిపారు. ప్రొ. బి.సి. ఐగోల్ నవల గురించి మాట్లాడుతూ, 'చరిత్రలోని ఒక సరికొత్త కోణాన్ని ఇందులో భగీరథ ఆవిష్కరించారు. ఇదో గొప్ప పరిశోధనా గ్రంధం. దీని కన్నడ అనువాదం కూడా చక్కగా ఉంది' అని అన్నారు. ప్రముఖ చిత్రకారుడు దాకోజు శివప్రసాద్‌ 'అహో ఆంధ్ర భోజా శ్రీకృష్ణదేవరాయ' గీతాన్ని పాడి వినిపించారు.

కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ రుద్రప్ప అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కన్నడ విశ్వవిద్యాలయం ప్రొ. ఎస్. వై. సోమశేఖర్, అన్నపూర్ణ సింగ్, పారిశ్రామికవేత్త భీమనేని భాస్కర నాయుడు, హెచ్. శ్రీనివాసరెడ్డి, పాటి సుబ్బారావు, బెల్లా తెలుగు సాంస్కృతిక సంఘం కార్యదర్శి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అతిధులను అధ్యక్షులు శకుంతల సత్కరించగా, కార్యదర్శి డా. ఆర్. వాత్సల్య వందన సమర్పణ చేశారు.

ఇవి కూడా చదవండి:

రామజోగయ్య శాస్త్రి తనయుడి సినీ అరంగేట్రం

Drishyam 3: 10 రోజుల్లోనే రూ.480 కోట్లు.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న దృశ్యం 3!

Akhil Raj: అనుపమతో కలిసి నటించాలన్న.. అమ్మ కోరిక నెరవేరింది

Updated Date - Oct 14 , 2026 | 02:45 PM

జైలర్ 2 ఆన్‌లైన్ విడుదలపై హైకోర్టు నిషేధం.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.40 కోట్లు!

ఎంజీఆర్ బయోపిక్.. జయల‌లిత‌గా త్రిష?

దర్శన్ కేసు విచార‌ణ‌.. త‌డ‌బ‌డ్డ న‌టులు! క్రాస్ ఎగ్జామినేషన్ కోసం అనుమ‌తి

దసరా వేళ అమ్మవారి సన్నిధిలో బోయపాటి శ్రీను.. విజయవాడ ఉత్సవాలపై ప్రశంసలు!

నాని మళ్లీ లవ్ స్టోరీ బాటలోకి.. 96 డైరెక్టర్‌తో సినిమా?