నాని మిస్సైనా.. నేనున్నానంటూ బరిలోకి దిగుతోన్న రవితేజ!
ABN , Publish Date - Jun 07 , 2026 | 07:18 PM
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’. ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
నేచురల్ స్టార్ నాని (Natural Star Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ తర్వాత రూపుదిద్దుకుంటోన్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise). ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఆగస్ట్ 21న విడుదల అంటూ మేకర్స్ ప్రకటించారు కానీ, ఆ డేట్‌కు కూడా ఈ సినిమా రావడం డౌటే అనేలా టాక్ నడుస్తోంది. చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఆలస్యం అవుతాయని, మరోసారి ఈ సినిమా వాయిదా పడుతుందనేలా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇది నాని ఫ్యాన్స్‌కు నిరాశ కలిగించే విషయమనే చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. నాని నిరాశ పరిచినా.. నేనున్నానంటూ అదే డేట్‌కి బరిలోకి దిగేందుకు మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) రెడీ అవుతున్నారు.
మాస్ మహారాజా రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘ఇరుముడి’ (Irumudi). ఆదివారం ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఆగస్ట్ 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల అంటూ మేకర్స్ ఓ పోస్టర్ వదిలారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే.. అంతా నానికి పోటీగా రవితేజ అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. కానీ, నాని ‘ది ప్యారడైజ్’ వచ్చే విషయంలో క్లారిటీ లేదు కాబట్టి.. ఫ్యాన్స్ అందరికీ ఆరోజు రవితేజ మాత్రం ట్రీట్ ఇవ్వడం పక్కా అని చెప్పుకోవచ్చు. ఒక వేళ అదే డేట్‌కి నాని కూడా వస్తే మాత్రం.. పోటీ మరింత ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో ‘ది ప్యారడైజ్’ టీమ్ నుంచి స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
ఇక ‘ఇరుముడి’ విషయానికి వస్తే.. ఇటీవల వచ్చిన ‘ది హార్ట్ ఆఫ్ ఇరుముడి’ గ్లింప్స్ మంచి స్పందనను రాబట్టుకోవడమే కాకుండా, సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. భక్తి, కుటుంబ భావోద్వేగాలు, యాక్షన్ అంశాల సమ్మేళనంగా.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుందని, ఓ అంకితభావం గల తండ్రి పాత్రలో రవితేజ నటన ప్రేక్షకుల హృదయాలను తాకేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతుండగా.. ప్రధాన తారాగణం పాల్గొంటోంది. రవితేజ సరసన ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బేబీ నక్షత్ర కీలక పాత్ర పోషిస్తోంది. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆ పనిచేస్తే టీవీకే సర్కారుకు మంచి పేరు -సత్యరాజ్
నీ కోసమే నాన్న.. రామ్ చరణ్‌కు క్లీంకార పాప అదిరిపోయే సర్‌ప్రైజ్!
ట్రోలింగ్.. చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇలా తయారయ్యారేంట్రా!