సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బడ్జెట్ కంట్రోల్‌లో రామ్.. తనదాకా వస్తే కానీ తెలియలేదేమో!

ABN, Publish Date - Jun 15 , 2026 | 05:27 PM

తనదాకా వస్తే కానీ తెలియదని అంటారు కదా.. సేమ్ టు సేమ్ ఇప్పుడు రామ్‌ పోతినేని విషయంలో ఇప్పుడిదే టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు హీరోగా చేసి, హాయిగా తన రెమ్యునరేషన్ తీసుకునేవారు రామ్.

Ram Pothineni

తనదాకా వస్తే కానీ తెలియదని అంటారు కదా.. సేమ్ టు సేమ్ ఇప్పుడు రామ్‌ పోతినేని (Ram Pothineni) విషయంలో ఇప్పుడిదే టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు హీరోగా చేసి, హాయిగా తన రెమ్యునరేషన్ తీసుకునేవారు రామ్. కానీ, ఇప్పుడాయన తనలోని మల్టీ టాలెంట్‌ని ప్రదర్శిస్తూ.. దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న సినిమా (Rapo23)కు సంబంధించి ఇటీవలే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇదిలా ఉంటే, వరుస పరాజయాలలో ఉన్న రామ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గొప్ప విషయమనే చెప్పుకోవాలి. ఇప్పుడీ సినిమా బడ్జెట్ విషయంలో రామ్ ప్రతీది లెక్కలేసుకుని మరీ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.


అంతకు ముందు సినిమాకు రూ. 25 కోట్ల వరకు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిన రామ్.. వరుస పరాజయాలతో కేవలం లాభాల్లో షేరింగ్ మాత్రమే అనే స్థాయికి చేరుకున్నారు. ఆయన హీరోగా నటించిన ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమాకు కూడా ప్రాఫిట్ షేర్ పద్ధతిలోనే పని చేశారు. ఇప్పుడు తన తదుపరి సినిమాను తనే స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహిస్తుండటంతో.. భారీ రెమ్యునరేషన్లు, సెట్స్‌పై జరిగే వృధా ఖర్చులను కంట్రోల్‌లో ఉంచుకునేలా ముందడుగు వేస్తున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇది తెలియకే.. తెలుగు సినిమా నిర్మాతలు పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రామ్ తొలిసారి తనే నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో.. సినిమా బడ్జెట్‌ విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే..


ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్ర కోసం ఎస్.జె. సూర్యను సంప్రదించారట. ఎస్‌జె సూర్య ఏకంగా రూ. 8 కోట్ల భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంతో, రామ్ ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట ప్రారంభించారని తెలుస్తోంది. ఇక హీరోయిన్ పాత్ర కోసం రామ్ టీమ్ శ్రీనిధి శెట్టిని సంప్రదించగా, ఆమె రూ. 1.5 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆ వెంటనే కయాదు లోహర్‌ను సంప్రదించి, ఆమెతో చర్చలు జరుపుతున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఒకవేళ కయాదు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతే, ఆ పాత్రకు సంయుక్తను లాక్ చేయాలని రామ్ ప్లాన్ చేస్తున్నారట. రెమ్యునరేషన్ల పరంగా బడ్జెట్‌ను తగ్గించి, క్వాలిటీ సినిమాను అందించాలనే ఆలోచనలో రామ్ ఉన్నారని తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో వేచి చూడాల్సిందే. రామ్ సోదరుడు కృష్ణ చైతన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్

బాలీవుడ్‌లో కనిపించని నవతరం స్టార్స్.. హిందీ సినిమా ఫ్యూచర్ ఏంటి?

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

Updated Date - Jun 15 , 2026 | 05:27 PM