పెద్ది ట్రైలర్... పెద్ద తతంగమే ఉంది!
ABN, Publish Date - May 12 , 2026 | 11:42 AM
రామ్ చరణ్ పెద్ది సినిమా ట్రైలర్ మే 18న విడుదల కాబోతోంది. అయితే ఆ మర్నాడే ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తున్న నేపథ్యంలో ఇది చర్చనీయాంశంగా మారింది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా (Buchibabu Sana) కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' (Peddi) చిత్రంపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 'గేమ్ ఛేంజర్' వంటి భారీ చిత్రం తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో, దీనిపై మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ స్పీడ్ పెంచుతూ, మే 18వ తేదీన చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ ప్రకటనతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో సినిమాపై హైప్ ఆకాశాన్ని తాకింది.
అయితే, ఈ ట్రైలర్ విడుదల తేదీ వెనుక దర్శకుడు బుచ్చిబాబు సానా ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సరిగ్గా మే 19వ తేదీ అర్ధరాత్రి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) - ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబో మూవీ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశం ఉండటంతో పాటు, మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా 'దేవర-2' (Devara 2), 'గాడ్ ఆఫ్ వార్' వంటి చిత్రాల నుంచి కూడా అప్‌డేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ హంగామా మొదలవ్వడానికి ఒక్క రోజు ముందే 'పెద్ది' ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా, సినిమాపై ఉన్న క్రేజ్‌ను పీక్ స్టేజ్‌కు తీసుకెళ్లాలని బుచ్చిబాబు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మే 18న ట్రైలర్ రిలీజ్ చేయడం ద్వారా నందమూరి అభిమానుల దృష్టిని కూడా తన వైపు తిప్పుకోవాలని బుచ్చిబాబు ప్రయత్నిస్తున్నారని కొందరు అంటుంటే, ఇది రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానుల మధ్య పోలికలకు లేదా అనవసరపు చర్చలకు దారితీస్తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఒకరకంగా బుచ్చిబాబు కావాలనే మెగా - నందమూరి ఫ్యాన్స్ మధ్య పోటీ పెడుతున్నారా? అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి బుచ్చిబాబు సానాకు ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం ఉంది. తారక్ నటించిన 'నాన్నకు ప్రేమతో' చిత్రానికి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. అంతేకాకుండా, గతంలో ఎన్టీఆర్ కోసం కూడా ఆయన ఒక కథను సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, కేవలం సినిమా ప్రమోషన్ల కోసం ఇద్దరు స్టార్ హీరోల మధ్య ఆయన చిచ్చు పెడతారన్న మాటలో వాస్తవం లేదని సినీ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. పైగా, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు అగ్ర హీరోల సినిమాల నుంచి అప్‌డేట్స్ రావడం అనేది సగటు సినిమా ప్రేమికులకు, ఇద్దరు హీరోల అభిమానులకు పండుగ లాంటి విషయమని వారు గుర్తు చేస్తున్నారు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంతటి ప్రాణ స్నేహితులో ప్రపంచం మొత్తానికి తెలుసు. 'ఆర్.ఆర్.ఆర్.' సినిమాతో వీరి మధ్య ఉన్న బంధం మరింత ధృడపడింది. ఒకరి సినిమాల పట్ల మరొకరు ఎప్పుడూ గౌరవంగా ఉంటూ, పర్సనల్ లైఫ్‌లోనూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. అలాంటి స్నేహితుల అభిమానుల మధ్య వివాదాలు సృష్టించడం బుచ్చిబాబు ఉద్దేశం కాదని, కేవలం సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతోనే ప్రమోషన్ల షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్తున్నారని స్పష్టమవుతోంది. ఏది ఏమైనా, మే 18, 19 తేదీలు టాలీవుడ్‌లో సరికొత్త సంచలనానికి వేదిక కానున్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
తన తొలి సినిమా హీరో విజయ్ పై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్!
అవసరమే కానీ.. పెళ్లిపై ఫరియా అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్!