రామ్ చరణ్-సుకుమార్ ‘RC17’ రిలీజ్ ప్లాన్ ఇదేనా?
ABN, Publish Date - Nov 28 , 2026 | 06:21 PM
‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’. ఈ సినిమాకు రిలీజ్‌కు సంబంధించి ఇప్పుడో వార్త వైరల్ అవుతోంది.
‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), క్రియేటివ్ జీనియస్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ‘RC17’. ఈ నెల 1వ తేదీన పూజా కార్యక్రమాలతో ఈ సినిమా గ్రాండ్‌గా మొదలైంది. చరణ్, సుకుమార్ కలయిక మరోసారి రిపీట్ అవుతుండటంతో ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. షూటింగ్ ఇంకా మొదలు కాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే... ఈ సినిమా విడుదల తేదీ ప్లాన్ (RC17 Release Plan). ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకుంటున్నాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి ఇంకా కొంత సమయం ఉంది. వచ్చే ఏడాది అంటే జనవరి లేదా ఫిబ్రవరిలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరి రిలీజ్ ఎప్పుడంటే? 2027లో మొదలయ్యే ఈ సినిమాను 2028 ద్వితీయార్ధంలో విడుదల చేయాలని మేకర్స్ గట్టిగా ఆలోచిస్తున్నారట. అంటే సినిమా షూటింగ్‌నే దాదాపు ఏడాది పాటు ప్లాన్ చేస్తున్నారన్నమాట. సుకుమార్ సినిమా అంటే ఆ మాత్రం చెక్కడం, క్వాలిటీ కోసం టైమ్ తీసుకోవడం సహజమే కదా. 2028 సెకండ్ హాఫ్‌లో థియేటర్లలో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక ఈ సినిమాను సుకుమార్ ఒక సరికొత్త, ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ కాబోతోంది. ఇప్పటికే చరణ్ పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందట. గత సినిమాలకు పూర్తి భిన్నంగా, బరువు తగ్గి, పొడవాటి జుట్టుతో సరికొత్త స్టైలిష్ లుక్‌లో చరణ్ కనిపించబోతున్నారని ఫిల్మ్ నగర్లో జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాదు.. ఈ ప్రాజెక్ట్‌కు మైథాలాజికల్ టచ్ కూడా ఉందనే టాక్ వినిపిస్తోంది.
ఒకవైపు కథ, లుక్ ఇలా ఉంటే.. మరోవైపు నటీనటుల ఎంపికపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ లేదా ‘ఆకాశంలో ఒక తార’ చిత్రంలో నటించిన తెలుగు అమ్మాయి సాత్విక వీరవల్లిలలో ఒకరు నటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు అనీత్ పడ్డా, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరిని ఫైనల్ చేస్తారో చూడాలి. ఇక సంగీత దర్శకుడి విషయానికి వస్తే అనిరుధ్ రవిచంద్, అలాగే శాశ్వత్ సచ్దేవ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇతర కీలక నటీనటులను కూడా త్వరలోనే ఫైనల్ చేయాల్సి ఉంది. మొత్తానికి 2027లో షూటింగ్ మొదలుపెట్టి, 2028 ద్వితీయార్ధంలో రిలీజ్ టార్గెట్‌తో రానున్న ‘RC17’ పై రోజురోజుకూ క్యూరియాసిటీ పెరుగుతోంది.
లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఫిక్స్..
తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లోకి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు (Ratnavelu ISC) అడుగుపెట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇండస్ట్రీ హిట్ ‘రంగస్థలం’ చిత్రానికి కూడా డీఓపీ రత్నవేలు అనే విషయం తెలిసిందే. విజనరీ డీఓపీ రత్నవేలు చేరికతో ‘ఆర్సీ17’ ద్వారా ఊహకు అందని అద్భుతమైన విజువల్ వండర్‌ను వెండితెరపై ఆవిష్కరించబోతున్నామని చిత్ర బృందం స్పెషల్ పోస్టర్‌తో ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
మోక్షజ్ఞ చిత్రంలో ఎన్టీఆర్.. థియేటర్లలో విధ్వంసమే
విశ్వక్ ‘లెగసీ’ షూటింగ్ పూర్తి.. విడుదల ఎప్పుడంటే
ఎన్టీఆర్‌తో మూవీ.. రావిపూడి ప్లాన్ మామూలుగా లేదుగా