సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

RC17 హీరోయిన్ SA కాదు, AP కాదు, PM కాదు.. అచ్చ తెలుగమ్మాయ్

ABN, Publish Date - Oct 31 , 2026 | 03:04 PM

‘రంగస్థలం’.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన ఈ సంచలన విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ కాగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

RC17 Heroine Update

‘రంగస్థలం’.. బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాసిన ఈ సంచలన విజయం తర్వాత మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ (Mega Power Star Ram Charan), లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్ కాగానే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ ఏడాది శిష్యుడి ‘పెద్ది’ (Peddi) స్పోర్ట్స్ డ్రామాతో మెప్పించిన రామ్‌చరణ్, గురువు సుకుమార్‌తో కలిసి ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌ను టచ్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా సినిమా వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ కాంబినేషన్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ క్షణాల్లో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.


ఇప్పటికే RC17 ప్రాజెక్ట్ చుట్టూ ఎన్నో క్రేజీ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సుకుమార్ సినిమాలకు సంగీతమే ప్రాణం. ఆయన ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో ఈసారి కొత్త ప్రయోగం చేయబోతున్నారనే వార్త సెన్సేషన్ సృష్టిస్తోంది. అనిరుధ్ రవిచందర్ లేదా ధురంధర్ చిత్రంతో భారీ గుర్తింపు సంపాదించిన శాశ్వత్ సచ్‌దేవ్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దర్శకుడు సుకుమార్ ఈసారి సాంకేతిక విభాగం విషయంలో సరికొత్త కాంబినేషన్‌ను ఎంచుకోబోతున్నట్లు సమాచారం. ఇక సంగీత దర్శకుడి విషయం పక్కన పెడితే, రామ్‌చరణ్‌కు జోడీగా ఎవరు నటించబోతున్నారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. తొలుత ‘పొన్నియన్ సెల్వన్, ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్‌ (SA)కు స్క్రీన్ టెస్ట్ పూర్తి చేశారని ప్రచారం జరిగింది. ఆ తరువాత ప్రీతి ముకుందన్‌ (PM), ‘సైయారా’తో గుర్తింపు తెచ్చుకున్న అనీత్‌ పడ్డా (AP) పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. కానీ ఊహించని రీతిలో ఈ రేసులోకి ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న అచ్చ తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి (Satvika Veeravalli)ని ఫైనల్‌ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా సాత్విక వీరవల్లి తెలుగు, తమిళ మూలాలు కలిగిన అమ్మాయి కావడంతో.. మంచి నిర్ణయం అంటూ అప్పుడే ఫ్యాన్స్ కామెంట్స్ స్టార్ట్ చేశారు.


గత కొంతకాలంగా మన టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో తెలుగు హీరోయిన్లకు అవకాశాలు అంతగా దక్కడం లేదనే అసంతృప్తి ప్రేక్షకుల్లో ఉంది. సరిగ్గా ఇలాంటి సమయంలో, ఏకంగా రామ్‌చరణ్ లాంటి పాన్-ఇండియా స్టార్ సరసన, సుకుమార్ లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాలో తెలుగమ్మాయిని ఫైనల్ చేయడం విశేషమైన మార్పుకు నిదర్శనం. కొత్త ప్రతిభను ప్రోత్సహించడంలో సుకుమార్ తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రత్యేకం. ఈ నిర్ణయం నిజమైతే సాత్విక కెరీర్‌కు ఇది ఊహించని పెద్ద మైలురాయి అవుతుంది. ప్రస్తుతానికి సాత్విక పేరు దాదాపు ఖరారైనట్లు వార్తలు వస్తున్నప్పటికీ, మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నవంబర్ 1న నిర్వహించనున్న గ్రాండ్ పూజా కార్యక్రమంలో ఈ వివరాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక అచ్చ తెలుగు అమ్మాయిని ఇంత భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సెలక్ట్‌ చేయడం సుకుమార్‌ తీసుకున్న గ్రేట్‌ స్టెప్‌ అనే చెప్పాలి.

ఇవి కూడా చదవండి:

రూ.200 కోట్ల దోపిడీ కేసులో ట్విస్ట్.. నోరా ఫతేహీకి ఢిల్లీ హైకోర్టు సమన్లు

‘జిమ్ జిమ్ తార’ సాంగ్.. కాంట్రవర్సీలో ‘ఆదర్శ కుటుంబం’

సమంతకు కవల పిల్లలా.. ఆ హీరోయిన్ అలా కామెంట్‌ చేశారేంటి?

Updated Date - Oct 31 , 2026 | 03:08 PM