దర్శకుడిగా మారుతున్న గీత రచయిత కళ్యాణ చక్రవర్తి
ABN , Publish Date - Nov 26 , 2026 | 06:24 PM
ప్రముఖ గీత రచయిత కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కొత్త నటుడు హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 75 శాతం పూర్తయింది.
అలనాటి సముద్రాల సీనియర్‌తో మొదటి పెడితే... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వరకూ ఎంతోమంది మెగాఫోన్ చేత పట్టి తమ సత్తాను చాటుకున్నారు. విజయవంతమైన చిత్రాలకు కథ, మాటలు, పాటలు అందించిన యువ రచయితలు కూడా కొందరు ఏదో సందర్భంలో దర్శకత్వం వహించి తమ అదృష్టాన్ని పరీక్షిచుకున్న వారే. ఇప్పుడు ఆ జాబితాలోకి ప్రముఖ గీత రచయిత కళ్యాణ చక్రవర్తి పేరు చేరబోతోంది.

గీత రచయితగా తనదైన బాణీని పలికించిన కళ్యాణ చక్రవర్తి త్రిపురనేని ఓ సినిమాకు దర్శకత్వం వహించారు. కొత్త నటుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను గోల్డ్ మౌంటెన్ క్రియేషన్స్ పతాకంపై అనురాగ్ పర్వతనేని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మూడొంతులు పూర్తయ్యిందని, నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలను ఈ నెల 28న జరిగే మీడియా సమావేశంలో వెల్లడిస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
Ramayanam: రామాయణం.. అమిత్ షా ఏమన్నారంటే?
ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?
నంది అవార్డుల కమిటీల ఏర్పాటు.. స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా బాలకృష్ణ