జూన్‌లోనే ‘పెద్ది’.. అధికారిక ప్రకటన వచ్చేసింది
ABN, Publish Date - Apr 15 , 2026 | 06:06 PM
అనుకున్నదే అయ్యింది. మొదటి నుంచి వినిపిస్తున్నట్లుగా మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీ వాయిదా పడింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.
అనుకున్నదే అయ్యింది. మొదటి నుంచి వినిపిస్తున్నట్లుగా మరోసారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ‘పెద్ది’ మూవీ (Peddi Movie) వాయిదా పడింది. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాకపోవడంతో, ఏదో జరుగుతుందని, ఏప్రిల్ ఎండింగ్‌కు సినిమా వచ్చే అవకాశం ఉందని, ఎక్కడో ఫ్యాన్స్ కొద్దిగా హోప్స్ పెట్టుకున్నారు. ఆ హోప్స్ మీద నీళ్లు చల్లుతూ.. చల్లగా వాయిదా కబురుని టీమ్ విడుదల చేసింది. అవును, ‘పెద్ది’ సినిమా జూన్‌లో (Peddi Release Update) విడుదల అంటూ టీమ్ అధికారింగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ ప్రకటనలో..
‘‘ముందుగా, మా సినిమా పాటలకు, గ్లింప్స్‌కు మీరు అందించిన అద్భుతమైన స్పందనకు ధన్యవాదాలు. ‘పెద్ది’ సినిమాపై మీరు చూపిస్తున్న ప్రేమ, ఉత్సాహాన్ని చూడటం మాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. సినిమాకు సంబంధించిన టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది, కేవలం ఒక పాట చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఎడిటింగ్ వెర్షన్ చూశాం, అవుట్‌పుట్ విషయంలో మేము చాలా సంతృప్తిగా ఉన్నాము.
మా చేతిలో ఉన్న ఇటువంటి గొప్ప కంటెంట్‌ను మీకు గొప్పగా అందించాలని మేము కోరుకుంటున్నాము. అందుకోసం, మా సాంకేతిక నిపుణులు, పోస్ట్-ప్రొడక్షన్ టీమ్ ఎక్కడా రాజీ పడకుండా, అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చేందుకు మరికొంత సమయం కేటాయించడం అవసరమని మేము భావిస్తున్నాము. మీకు అత్యుత్తమ థియేట్రికల్ అనుభవాన్ని అందించడం మా బాధ్యత. కావున, సినిమా విడుదలను జూన్ నెలకు వాయిదా వేయాలని మేము నిర్ణయించుకున్నాము. జూన్‌లో ఎప్పుడు విడుదల అనేది అతి త్వరలోనే ప్రకటిస్తాము. మీరు నిరంతరం అందిస్తున్న మద్దతుకు, ఓపికకు ధన్యవాదాలు. ఇది మాకు ఎంతో విలువైనది’’ అని ‘పెద్ది’ టీమ్ పేర్కొంది.
రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న విషయం తెలిసిందే. మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా విడుదల అని చెప్పిన టీమ్, ఏప్రిల్ 30 అంటూ వాయిదా వేశారు. ఇప్పుడు మరోసారి వాయిదా అని చెబుతూ జూన్‌లో విడుదల అని తెలియజేశారు. దీంతో ఫ్యాన్స్ అందరిలో నిరాశ నెలకొంది. అయితే కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో.. ఎప్పుడు వచ్చిన.. రికార్డులు బద్దలవడం పక్కా అంటూ ఫ్యాన్స్ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
మొన్న చరణ్.. ఇప్పుడు వరుణ్.. ‘బరి’ సెట్‌లో ప్రమాదం
దేవుడిచ్చిన బాడీని.. ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి వాడుతున్నా! - విష్ణుప్రియ
అమ్మాయిలు చూస్తున్నారని, నాన్న కొడుతున్నా పారిపోలేదు -రాజశేఖర్
UBS OTT: ఉస్తాద్ ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు.. స్ట్రీమింగ్ వివరాలివే!