మెకానికల్ ఇంజనీర్ అవుతానని.. నాన్నకి అబద్ధం చెప్పా: రామ్ చరణ్
ABN, Publish Date - May 29 , 2026 | 10:14 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్‌లో యమా బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రమోషన్స్‌లో చరణ్.. తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఆసక్తికర విషయాలను చెబుతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్‌లో యమా బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రమోషన్స్‌లో చరణ్ తనదైన స్టైల్‌లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలను, అలాగే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) క్రమశిక్షణను గుర్తుచేసుకుంటూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తనకు నటుడవ్వాలని కోరిక ఉన్నా, తన తండ్రికి ఎలా చెప్పాలో అర్థం కాక.. అబద్ధం చెప్పానని.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
‘‘నేను చిన్నప్పటి నుంచి ఒక రకమైన ఒంటరితనంతో, లోకజ్ఞానం లేకుండా ఉండేవాడిని. అజ్ఞానం అనేది ఒక వరం అయితే.. దానికి నేనే ఒక స్పష్టమైన ఉదాహరణని. మా ఇంట్లోకి సినిమా వాతావరణం అస్సలు వచ్చేది కాదు. సినిమాలకు సంబంధించిన అవార్డులు, మ్యాగజైన్‌లు అన్నీ ఆఫీస్ దగ్గరే ఆగిపోయేవి తప్ప, ఇంటికి వచ్చేవి కావు. సినిమా పత్రికలను ముట్టుకోవడానికి కూడా మేము భయపడేవాళ్లం. అందకు మా నాన్న ఎంత పెద్ద స్టార్ అనేది మాకు అప్పట్లో సరిగ్గా తెలిసేది కాదు. నాన్న పిలిస్తే తప్ప షూటింగ్ సెట్స్‌కి కూడా వెళ్లే ధైర్యం చేసేవాళ్ళం కాదు.. ఆ క్రమశిక్షణే మమ్మల్ని సినిమా ప్రపంచానికి దూరంగా ఉంచింది.
ఇక నేను నటుడు అవ్వాలనుకుంటున్న విషయాన్ని కూడా చాలా కాలం పాటు నాన్నకు చెప్పలేదు. ఒకరోజు నాన్న నన్ను పిలిచి నీ వయసు 17 ఏళ్లు కదా, ఏం చేయాలనుకుంటున్నావ్? అని అడిగారు. అప్పుడు నా కోరిక చెబితే కొడతారేమో అని భయం వేసి, ఆయనను ఇంప్రెస్ చేయడానికి నేను మెకానికల్ ఇంజనీర్ అవుతానని అబద్ధం చెప్పాను, కానీ నా మనసులో మాత్రం నటుడు అవ్వాలనే ఉంది. ఆ తర్వాత నా చదువు పూర్తయ్యాక, సరైన సమయం చూసి నాన్నే నటుడవ్వమని చెప్పారు’’ అని రామ్ చరణ్ తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. నిజంగా రామ్ చరణ్ మెకానికల్ ఇంజనీర్ అయ్యింటే మాత్రం.. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప నటుడిని మిస్సయ్యేది.. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
అరుదైన పిక్.. సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కండక్టర్’ ఐడీ కార్డ్!
NBK111: బాలయ్య గ్యాంగ్‌స్టర్ లుక్.. ముంబై అడ్డాగా వేట!
యూపీలో పౌల్ట్రీ బిజినెస్.. భూమి పూజతోనే బండ్ల గణేష్ పరార్.. ఎందుకంటే?