Rajasekhar: జీవిత చెబితే నేను వింటాననుకుంటారు.. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది

ABN , First Publish Date - 2023-12-05T22:07:49+05:30 IST

నితిన్‌, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’. వక్కంతం వంశీ దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీస్ బ్యానర్ల‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది. ఆమె నా మంచికే చెబుతుంటుంది కాబట్టి ఏం చెప్పినా నేను వింటానని తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో రాజశేఖర్ అన్నారు.

Rajasekhar: జీవిత చెబితే నేను వింటాననుకుంటారు.. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది
Jeevitha and Rajasekhar

నితిన్‌ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకుడు. శ్రేష్ట్ మూవీస్, రుచిర ఎంటర్టైన్మెంట్స్, ఆదిత్య ఎంటర్టైన్మెంట్ అండ్ మూవీస్ బ్యానర్ల‌పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిసెంబర్‌ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ వేడుకను మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో (Extra Ordinary Man Pre Release Event)

యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ (Rajasekhar) మాట్లాడుతూ.. ‘‘నన్ను ఒకసారి సడెన్‌గా పిలిచారు. ఈ కథ చెప్పారు. నన్ను కన్విన్స్ చేశారు. స్పెషల్ అప్పియరెన్స్ పాత్రను చేశాను. నాకు నచ్చింది. పాత్ర చాలా బాగుందని చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలు, నితిన్‌కు థాంక్స్. జీవిత చెబితే నేను వింటాను అని అంతా అనుకుంటారు. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది. ఆమె నా మంచికే చెబుతుంటుంది కాబట్టి ఏం చెప్పినా నేను వింటాను. తెరపై జాలీగా, ఆకతాయిగా నటిస్తారు కదా? సెట్‌లోనూ నితిన్ అలానే ఉంటారని అనుకున్నాను. కానీ సెట్స్ మీద హీరోగా, నిర్మాతగా ఎంతో బాధ్యతతో ఉండేవారు. దర్శకుడు నన్ను బాగా చూపించారు’’ అని అన్నారు.


Nithiin-Pic.jpg

జీవిత రాజశేఖర్ (Jeevitha Rajasekhar) మాట్లాడుతూ.. ‘‘భార్యభర్తలు అన్నాక ఒకరి మాట ఒకరు వినాలి.. ఒకరి కోసం ఇంకొకరు బతకాలి.. అలాంటి మైండ్ సెట్ ఉంటేనే పెళ్లి చేసుకోవాలి. మేం ఇద్దరం ఒకరికొకరం బతుకుతాం. మంచి పాత్ర దొరికితే ఆయన విలన్‌‌గా అయినా, ఓ స్పెషల్ అప్పియరెన్స్ అయినా చేస్తారు. మాకు వంశీ ఏం చెప్పారో అదే తీశారు. సుధాకర్ రెడ్డి‌గారు మా వారు చేసిన ‘మగాడు’ సినిమాతో డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారు. అది చాలా పెద్ద హిట్ అయింది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీలీలకు పెద్ద విజయం రావాలి’’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

====================

*Asha Bhosle and Mumtaz: ముంతాజ్, ఆశా భోంస్లేల డ్యాన్స్ వీడియో వైరల్.. రెండు కళ్లు చాలడం లేదంటూ..

****************************************

*Vishal: చెన్నై మేయర్‌పై విశాల్ సెటైర్లు.. ఘాటుగా స్పందించిన మేయర్

************************************

*Nithiin: ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం..

*************************************

*Neha Shetty: సుట్టంలా వచ్చి.. ఇష్టసఖిగా మారుతోంది

***************************************

Updated Date - 2023-12-05T22:07:50+05:30 IST