Rajasekhar: యూవీ క్రియేష‌న్స్‌లో.. శ‌ర్వానంద్‌, రాజ‌శేఖ‌ర్‌! కాంబినేష‌న్ అదిరిపోయిందిగా

ABN , Publish Date - Apr 22 , 2024 | 03:06 PM

యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ మ‌రోసారి ఓ యంగ్ హీరో చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యాడు

Rajasekhar: యూవీ క్రియేష‌న్స్‌లో.. శ‌ర్వానంద్‌, రాజ‌శేఖ‌ర్‌! కాంబినేష‌న్ అదిరిపోయిందిగా
sharwa 36

యాంగ్రీ యంగ్ మెన్ రాజ‌శేఖ‌ర్ ((Rajasekhar)) మ‌రోసారి ఓ యంగ్ హీరో చిత్రంలో న‌టించేందుకు సిద్ధ‌మ‌య్యాడు ఈ మ‌ధ్యే నితిన్ ఎక్ట్రా అర్టీన‌రీ మ్యాన్ సినిమాలో ఓ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ఆయ‌న ఈ సారి శ‌ర్వానంద్ (Sharwanand) హీరోగా తెర‌కెక్కుతున్న సినిమాలో న‌టించ‌బోతుండ‌గా ప్రెస్టీయ‌స్ బ్యాన‌ర్ ప్ర‌భాస్ (Prabhas), శ‌ర్వానంద్‌ల‌కు హోం బ్యాన‌ర్ అయిన యూవీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌డం విశేషం. గ‌తంలో ఈ బ్యాన‌ర్‌లో శ‌ర్వానంద్ (Sharwanand) హీరోగా ర‌న్ రాజా ర‌న్‌, ఎక్స్ ప్రెస్ రాజా, మహానుభావుడు వంటి మంచచి సూప‌ర్ హిట్ చిత్రాలు రాగా ఇప్పుడు నాలుగో సారి స‌రికొత్త కాన్సెస్ట్‌తో వ‌స్తున్నారు.

sharwa.jpeg

గ‌త నెల‌లో జ‌న్మ‌దినం సంద‌ర్భంగా శ‌ర్వ 6వ‌ (Sharwa 36) చిత్రం అధికారికంగా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. లూజర్ అనే వెబ్ సిరీస్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్న అభిలాష్ రెడ్డి కంక‌ర (Abhilash Reddy Kankara) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోండ‌గా మాళ‌వికా నాయ‌ర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇజ‌బ్రాన్ సంగీతం అందించున్నారు. ఇప్పుడు రాజ‌శేఖ‌ర్ ఈ చిత్రంలోనే ఫుల్ లెంగ్త్‌ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు స్టోరీ డిస్క‌ర్సన్స్ అవ‌డం, క‌థ న‌చ్చి ఓకే చెప్పేయ‌డంతో పాటు ప్ర‌స్తుతం షూటింగ్‌లో కూడా జాయిన్ అయిన‌ట్లు తెలుస్తోంది.


ఇదిలాఉడ‌గా.. గ‌తంలో విడుద‌ల చేసిన ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ను గ‌మ‌నిస్తే ఈ సినిమా స్పోర్ట్స్ జాన‌ర్‌లో రూపొంద‌నున్న‌ట్లు తెలుస్తోండ‌గా ఫ్యామిలీ ఎమోష‌న్స్‌తో మూడు త‌రాల కుటుంబ స‌భ్యుల నేప‌థ్యంలో చిత్ర క‌థ సాగ‌నున్న‌ట్లు వార్త‌లు హ‌ల్ చేస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో రాజ‌శేఖ‌ర్ ఎలాంటి క్యారెక్ట‌ర్ చేస్తున్నాడ‌నేది తెలియ రాలేదు. ప్ర‌స్తుతం శ‌ర్వానంద్ న‌టించిన 35 వ చిత్రం మ‌న‌మే (Manamey, ) త్వ‌ర‌లో విడుద‌ల‌కు రెడీ అవుతుండ‌గా ఈ చిత్రాన్ని ఈ ఏడిఇ చివ‌ర్లో ధియేట‌ర్ల‌లోకి తీసుకు వ‌చ్చేంద‌కు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Updated Date - Apr 22 , 2024 | 03:10 PM