సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అందుకే చిరు.. ‘ఠాగూర్’ సినిమాపై రాజశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 24 , 2026 | 10:27 PM

మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘ఠాగూర్’ సినిమా, యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ చేయాల్సిన సినిమా అని, చివరి నిమిషంలో చేతులు మారిందనేలా ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ వార్తలపై రాజశేఖర్ క్లారిటీ ఇచ్చారు.

Dr Rajasekhar about Tagore Rights Controversy

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) చేసిన ‘ఠాగూర్’ (Tagore) సినిమా, యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ (Angryman Rajasekhar) చేయాల్సిన సినిమా అని, చివరి నిమిషంలో చేతులు మారిందనేలా ఇప్పటికీ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తమిళ్‌లో పెద్ద హిట్టైన ఈ సినిమా హక్కులను మొదట రాజశేఖర్ సొంతం చేసుకుని, అడ్వాన్స్ చెల్లించారట. కానీ, అగ్రిమెంట్ చేసుకోకపోవడంతో, ఈ సినిమా చేతులు మారి నిర్మాత మధు (Producer Madhu) చేతికి వెళ్లిందని, వాళ్లు చిరంజీవితో ఆ సినిమా చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజశేఖర్ తెలిపారు. అసలు ఈ చేతులు మారడం వెనుక ఏం జరిగింది? ఎందుకు రాజశేఖర్ ఈ సినిమా చేయలేకపోయారు? అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ..


‘‘ఠాగూర్.. నేను చేయాల్సిన సినిమా. రైట్స్ నేను కొనుక్కున్నాను. ఆ సినిమా కొనుక్కొని అడ్వాన్స్ అంతా ఇచ్చేసి, నా ఫ్రెండే కదా అని అగ్రిమెంట్ చేసుకోలేదు. అప్పుడు.. ఠాగూర్ మధు ఉన్నారు కదా! ఆయన వెళ్లి, ఆ ప్రొడ్యూసర్‌ని కలిసి.. చిరంజీవితో అనుకుంటున్నామని, ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పి, ఎక్కువ డబ్బులు ఇచ్చి రైట్స్ తీసుకున్నారు. నేను అప్పటికి అగ్రిమెంట్ చేయలేదు కాబట్టి నాకివ్వలేదు, వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు.. అది జరిగింది’’ అంటూ, ఈ ఇంటర్వ్యూలో రాజశేఖర్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవడమే కాకుండా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మెగా డామినేషన్ అప్పట్లో అలా ఉండేదని కొందరు అంటుంటే, మరికొందరు మాత్రం, రాజశేఖర్ ఈ సినిమా చేసుంటే, అంత పెద్ద హిట్టయ్యేది కాదని అంటున్నారు. చిరంజీవి ఈ సినిమా చేయడం, క్లైమాక్స్ మార్చడం వంటివి ప్లస్ అయ్యాయని.. అదే రాజశేఖర్ చేసి ఉంటే యాజీటీజ్‌గా చేసేవారని, అప్పుడది మరో ‘శేషు’ అయ్యేది అంటూ నెటిజన్లు చేస్తున్న కామెంట్స్‌తో ఈ వీడియో బాగా సంచారం చేస్తోంది. చిరంజీవి హీరోగా మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుని సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ రిలీజ్ డేట్.. మరోసారి ‘లెనిన్’ త్యాగం చేయాల్సిందేనా!

తమన్నాతో బ్రేకప్.. మరో యంగ్ బ్యూటీని పట్టిన విజయ్ వర్మ!

పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్‌లోకి మరో బ్యూటీ! ఇక పరువాల విందే!

Updated Date - Apr 24 , 2026 | 10:27 PM