Rajasekhar: చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే చేస్తా.. కానీ?

ABN , Publish Date - Apr 16 , 2026 | 09:03 PM

ఇప్పటి వరకు ఉన్న అపోహలు అన్నీ పక్కన పెట్టి మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం కచ్చితంగా చేస్తానని అన్నారు యాంగ్రీమ్యాన్ రాజశేఖర్. ఆయన చాలా గ్యాప్ తర్వాత.. ఓ కీలక పాత్రలో నటించిన ‘బైకర్’ చిత్రం మంచి సక్సెస్ సాధించింది.

Dr Rajasekhar

ఇప్పటి వరకు ఉన్న అపోహలు అన్నీ పక్కన పెట్టి మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సినిమాలో ఛాన్స్ వస్తే మాత్రం కచ్చితంగా చేస్తానని అన్నారు యాంగ్రీమ్యాన్ రాజశేఖర్ (Angry Man Rajasekhar). ఆయన చాలా గ్యాప్ తర్వాత.. ఓ కీలక పాత్రలో నటించిన ‘బైకర్’ (Biker) చిత్రం మంచి సక్సెస్ సాధించింది. శర్వానంద్ (Sharwanand) హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆయనకు తండ్రిగా రాజశేఖర్ కనిపించారు. ఈ సినిమా సక్సెస్ అవడంతో పాటు, రాజశేఖర్ పాత్రకు మంచి గుర్తింపు లభించడంతో, మీడియాకు తన సంతోషాన్ని తెలియజేసేందుకు ఆయన సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ..

రిపోర్టర్: అపోహలు అవన్నీ పక్కన పెడితే.. చిరంజీవి సినిమాలో ఆఫర్ వస్తే మీరు ఏం చేస్తారు?

రాజశేఖర్: చేస్తా.. తప్పకుండా చేస్తా.

రిపోర్టర్: అలాగే మీ పిల్లలు వరుసగా బిజీగా చేస్తున్నారు.. వాళ్ళ సినిమాలో విలన్‌గా అవకాశం వస్తే?

రాజశేఖర్: చేస్తాను.. మంచి క్యారెక్టర్ వస్తే చేస్తాను. కాకపోతే నాకు ఒక డౌట్ ఉంది. విలన్‌గా చేస్తే తర్వాత చూసేవాళ్ళందరూ ఏమంటారోనని? ‘మీరు సినిమా చేయండి, విలన్‌గా చేయవద్దు అంటారేమో అని’. ఎందుకంటే ‘తలంబ్రాలు’ అప్పుడు అనేవారు. ఇప్పుడు కమ్ బ్యాక్ తర్వాత అందరూ హ్యాపీగా ఉన్నారు. ఒకవేళ విలన్‌గా ఒకసారి ట్రై చేస్తే అప్పుడు రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది కదా.


రిపోర్టర్: మీరు చేసిన ధర్మం మిమ్మల్ని కాపాడింది అని అడిగితే ఏం చెప్తారు?

రాజశేఖర్: ‘ధర్మం తలై కాక్కుమ్’ (చేసే ధర్మమే తలని కాపాడుతుంది) అని తమిళ్‌లో ఒక సామెత ఉంది. సో తప్పకుండా ధర్మం ఎప్పుడూ మనల్ని కాపాడుతుంది. మనం చేసే మంచి కార్యక్రమాలు మనకు మంచి చేస్తాయి, అందులో డౌటే లేదు.

రిపోర్టర్: రాజకీయాల ప్రస్తావనకి వస్తే.. ప్రస్తుతం మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? జనం కన్ఫ్యూజన్‌లో ఉన్నారు.. మీరు కూడా కన్ఫ్యూజన్‌లో ఉన్నారా?

రాజశేఖర్: నేను కన్ఫ్యూజన్‌లో లేను గానీ.. పాలిటిక్స్‌లోకి వెళ్తే అది పెద్ద పని. మేము వెళ్ళినప్పుడల్లా మా పాకెట్ నుంచే డబ్బులు పెట్టాం కానీ, మాకు పాలిటిక్స్ నుంచి ఒక్క రూపాయి కూడా ఎప్పుడూ రాలేదు. ఖర్చులే ఎక్కువ. అంత కష్టపడి ఆ పని చేయాలంటే చాలా పెద్ద పని.. ఈ సినిమాలు పెట్టుకొని ఆ పని చేయలేము. ఒకటి సినిమా చేయాలి, లేదా రాజకీయాల్లో ఉండాలి. అది పెట్టుకొని ఇది చేస్తే డేట్స్ అన్నీ ప్రాబ్లం అవుతాయి, సరిగ్గా చేయలేము. అందుకే వద్దు అని మేము అనుకున్నాం.

ఇవి కూడా చదవండి:

Balakrishna: ‘రూటు’ మార్చిన బాలయ్య.. కొడుకు కథను పక్కన పెట్టి.. తనే ఆ దర్శకుడితో?

Rashmika Mandanna: రష్మికకు పిచ్చెక్కించేశారట.. పోస్ట్ వైరల్!

మంగ్లీకి మరో షాక్ ఇచ్చిన అడ్వొకేట్‌ సుబ్బారావు.. ఈ ట్విస్ట్ ఏంటయ్యో!

Updated Date - Apr 16 , 2026 | 09:03 PM

Rajasekhar: జీవిత చెబితే నేను వింటాననుకుంటారు.. కానీ నేను చెప్పిందే జీవిత వింటుంది

Rajasekhar: 27 ఏళ్ల తరువాత రాజశేఖర్ తో రొమాన్స్ కి సిద్దమైన శివగామి

Rajasekhar: జోరు పెంచిన యాంగ్రీ హీరో.. ఏకంగా మూడు సినిమాల్లో

Rajasekhar: మాన్‌స్టర్‌ గా మారిన యాంగ్రీ మాన్

Rajasekhar: సెట్ లో రాజశేఖర్ కి ప్రమాదం.. కాలికి తీవ్ర గాయం