ఆర్ఆర్ఆర్ కంటే వారణాసి పెద్ద సినిమా.. జక్కన్న సంచలన కామెంట్స్
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:16 PM
భారతీయ సినీ పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జక్కన్న.. ఇప్పుడు అంతకంటే పెద్ద విజిన్తో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’.
భారతీయ సినీ పరిశ్రమను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన ఏకైక దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రాలతో గ్లోబల్ లెవెల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన జక్కన్న.. ఇప్పుడు అంతకంటే పెద్ద విజిన్తో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం ‘వారణాసి’ (Varanasi). సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే తాజాగా బ్రెజిల్లో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి చేసిన కొన్ని సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అసలు ‘వారణాసి’ గురించి రాజమౌళి ఏం చెప్పారు? ఈ సినిమా ప్రత్యేకత ఏంటి? అనే విషయంలోకి వెళితే..
బ్రెజిల్లో జరిగిన ప్రతిష్టాత్మక 50వ సావో పాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న రాజమౌళి.. ‘వారణాసి’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. నా గత చిత్రం ‘ఆర్ఆర్ఆర్’తో పోలిస్తే ‘వారణాసి’ ఐదారు రెట్లు పెద్ద సినిమా అని స్పష్టం చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి 315 రోజుల సమయం పట్టిందని, కానీ అంతకంటే భారీ యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండియర్ ఉన్న ‘వారణాసి’ చిత్రాన్ని మాత్రం తాము కేవలం 275 రోజుల్లోనే పూర్తి చేశామని జక్కన్న తెలిపారు. అంటే షూటింగ్ పరంగా దాదాపు 40 రోజులను ఆదా చేశామన్నారు. సినిమా ఎంత పెద్దదైనా సరే.. షూటింగ్‌కు ముందే పక్కా పేపర్ వర్క్, సాలిడ్ ప్రిపరేషన్ ఉంటే సమయాన్ని ఎలా ఆదా చేయవచ్చో ‘వారణాసి’ నిరూపించిందని రాజమౌళి పేర్కొన్నారు. అంతేకాదు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెచ్చిపెట్టిన గ్లోబల్ అనుభవమే, ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేయడానికి తనకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చిందని ఆయన తెలిపారు.
ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కథానాయికగా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇక ఈ సినిమా కేవలం ఒక యాక్షన్ మూవీ మాత్రమే కాదని, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ, మైథలాజికల్ అంశాలు కలగలిపిన ఒక అద్భుతమైన అడ్వెంచర్ అనీ రాజమౌళి ఇదివరకే వెల్లడించారు. ముఖ్యంగా ఇందులో పవర్ ఫుల్ లవ్ స్టోరీతో పాటు, ఎమోషనల్ అయిన తండ్రీకొడుకుల బంధం ప్రధాన హైలైట్‌గా ఉండబోతుందట. ఎస్.ఎస్. కార్తికేయ, కె.ఎల్. నారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ టైమ్ ట్రావెల్ అండ్ మైథలాజికల్ యాక్షన్ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి ప్రపంచ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారో చూడాలంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఆగాల్సిందే.
ఇవి కూడా చదవండి:
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో ‘రాయవలస’ సాంగ్.. విశ్వక్ సేన్ అభినందనలు
ప్రియాంక పేరు వాడుకుంటే ఇంకోలా ఉండేది: పరిణీతి చోప్రా
‘ఫౌజీ’ పవర్ఫుల్ హిస్టారికల్ ఫైల్ నంబర్ 25 గ్లింప్స్