విమల్ థియేటర్‌లో ‘స్పిరిట్’ షూట్.. అభిమానుల కోలాహలం
ABN, Publish Date - Jun 01 , 2026 | 02:46 PM
రెబల్ స్టార్ ప్రభాస్, ఊర మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ కీలక అప్డేట్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas), ఊర మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit Movie). ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఇంటెన్స్ కాప్ యాక్షన్ డ్రామాను అత్యంత భారీ స్థాయిలో టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల్లో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఓ కీలక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..
హైదరాబాద్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, 45 ఏళ్ల చరిత్ర గల ఐకానిక్ సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లలో ఒకటైన విమల్ థియేటర్ (Vimal Theater)లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో స్వయంగా ప్రభాస్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఈ విషయం బయటకు లీకవడంతో.. అభిమానులు థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. అభిమానుల కోలాహలాన్ని నియంత్రించడానికి చిత్ర నిర్మాణ బృందం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా సమాచారం.
ఇప్పటి వరకు మేకర్స్ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమా కోసం వేచి చూసేలా చేస్తోంది. ‘స్పిరిట్’తో అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయంటూ ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు. చూద్దాం మరి.. ఏం జరుగుతుందో? బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో కాంచన, ఐశ్వర్య దేశాయ్ వంటివారు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలతో పాటు అంతర్జాతీయ భాషలైన చైనీస్, జపనీస్, కొరియన్ వెర్షన్లలో కూడా విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా 5 మార్చి, 2027న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలకానుంది.
ఇవి కూడా చదవండి:
కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!
టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!
Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!