కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్.. ఇదీ రష్మిక రేంజ్!
ABN , Publish Date - Jun 01 , 2026 | 02:05 PM
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ శ్రీవల్లి.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ.. కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటోంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna).. బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన ఈ శ్రీవల్లి.. ఇప్పుడు బాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ, స్టార్ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో కెరీర్‌లోనే హయ్యస్ట్ రెమ్యునరేషన్‌ని అందుకుని, బాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు సైతం షాకిచ్చారు. అవును, ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌లో చేస్తున్న సినిమాకు రూ. 15 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లుగా.. సినీ వర్గాల్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఇది నిజమైతే మాత్రం.. బాలీవుడ్‌లో ఎప్పటి నుంచో పాతుకుపోయిన హీరోయిన్లకు.. అతి తక్కువ సమయంలోనే రష్మిక ఝలక్ ఇచ్చిందని భావించవచ్చు. ఇదీ రష్మిక రేంజ్ అని ఫ్యాన్స్ గర్వంగా ఫీలవ్వవచ్చు.
బాలీవుడ్‌లో ఆమెకు ఈ క్రేజ్ రావడానికి కారణం వరుస సక్సెస్‌లనే చెప్పుకోవాలి. ‘ఛావా’, ‘యానిమల్’, ‘పుష్ప’ ఇలా వరుస సక్సెస్‌లతో బాలీవుడ్ ప్రేక్షకులకు అభిమాన తారగా రష్మిక మారారు. ‘ఛావా’తో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మికకు.. ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ‘యానిమల్’, ‘పుష్ప 2’ చిత్రాలు స్ట్రాంగ్ పిల్లర్స్‌గా నిలబడ్డాయి. ఆ తర్వాత చేసిన సినిమాలు అంతగా విజయం సాధించకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం పడిపోలేదు సరికదా.. డబుల్ అవుతోంది. పెళ్లి తర్వాత కూడా ఆమె సినిమాలు చేస్తూ.. గ్లామర్ విషయంలో కూడా సపోర్టివ్‌గా ఉంటుంది. అందుకే బాలీవుడ్‌లో ఆమెకు వరస అవకాశాలు తలుపుతడుతున్నాయి.
ఇక రష్మిక హయ్యస్ట్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ సక్సెస్ అయిన ‘కాక్‌టైల్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘కాక్‌టైల్ 2’ (Cocktail 2) రెడీ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ సీక్వెల్‌లో రష్మిక, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు హీరో షాహిద్ కపూర్ రూ. 35 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా టాక్. హీరోయిన్స్ అయినటువంటి కృతి సనన్ రూ. 15 కోట్లు, రష్మిక రూ. 15 కోట్లు.. రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లుగా సమాచారం. కృతి సనన్ మొదటి నుంచి బాలీవుడ్ నటిగానే గుర్తింపు పొందింది. ఆమె చాలా సినిమాలు కూడా చేసింది. కానీ, రష్మిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కొంతకాలమే అవుతోంది. అయినా, కృతితో సమానంగా రెమ్యునరేషన్ (Rashmika Remuneration) అంటే.. ఆమెకున్న క్రేజ్, సక్సెస్ రేట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిజంగా ఇది ఆమె అభిమానులు గర్వపడే విషయమేగా!
ఇవి కూడా చదవండి:
టాలీవుడ్ వర్క్ కల్చర్‌పై దీపికాకు జాన్వీ కౌంటర్!
Tollywood: విజయ దాహార్తి తీర్చని మే మాసం!
ఆ అవకాశం కోసం వేచి చూస్తున్నా.. పవన్‌పై బండ్ల గణేష్ పోస్ట్ వైరల్!