Spirit: కథను మలుపు తిప్పడమే కాదు.. అదే ప్రాణం కూడా..
ABN , Publish Date - Oct 27 , 2025 | 03:32 PM
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్పిరిట్’. ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా అంచనాలు పెంచేసింది.
ప్రభాస్ (prabhas) హీరోగా సందీప్ రెడ్డి వంగా (Sandeep reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్పిరిట్’ (Spirit) ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ‘వన్ బ్యాడ్ హ్యాబిట్’ అంటూ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడమే కాకుండా అంచనాలు పెంచేసింది. ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ALSO READ: 12A Railway Colony: ‘12ఎ రైల్వే కాలనీ’ వచ్చేది ఎప్పుడంటే
ఇందులో పోలీస్ కథతోపాటు మాఫియా బ్యాక్‌డ్రాప్ కూడా ఉందని తెలిసింది. సెకెండాఫ్‌లో ఇందుకు సంబంధించిన సీన్స్ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తాయని, ఆ పర్టిక్యూలర్ ఎపిసోడ్ సినిమాను మలుపు తిప్పుతుందని అదే కథకు ప్రాణమని చిత్ర బృందం నుంచి సమాచారం. ఇందులో ఎంతవరకూ నిజముందని తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే! ఇందులో త్రిప్తి డిమ్రి, వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్‌రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ALSO READ: SSS Motion Poster: టైం పది అయ్యింది... గ్లాసులు కడుక్కునే టైం అయ్యింది
The Girl Friend: నటించలేనన్న సందీప్ రెడ్డి వంగా..
Last Samurai Standing OTT: 300 మంది.. సమురాయ్‌లు తలబడితే! ఓటీటీకి.. కళ్లు చెదిరే వెబ్ సిరీస్
GD Naidu: మరో బయోపిక్ లో మాధవన్...