ప్రభాస్ కోసం ‘మిరాయ్’ డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్
ABN, Publish Date - Oct 23 , 2026 | 01:09 PM
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ వర్గాల్లో ఓ అదిరిపోయే వార్త చక్కర్లు కొడుతోంది. ‘మిరాయ్’ దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) పుట్టినరోజు (Happy Birthday Prabhas) సందర్భంగా టాలీవుడ్ వర్గాల్లో ఓ అదిరిపోయే వార్త చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ‘మిరాయ్’ ఫేమ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని (Karthik Gattamneni).. ఇప్పుడు ప్రభాస్ కోసం ఓ మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక బలమైన కారణం ఉంది. దర్శకుడు మారుతి కాంబినేషన్లో ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థే నిర్మించింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేక తీవ్ర నష్టాలను మిగిల్చింది.
తనను నమ్ముకున్న నిర్మాతలకు నష్టం వస్తే చూస్తూ ఊరుకోని ప్రభాస్.. ‘ది రాజా సాబ్’ తెచ్చిన నష్టాలను పూడ్చేందుకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి మరో సినిమా చేస్తానని అప్పట్లోనే మాటిచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడే డార్లింగ్, తమ బ్యానర్‌కు సాలిడ్ బ్లాక్‌బస్టర్ ఇచ్చే దర్శకుడి కోసం చూస్తున్న సమయంలో కార్తీక్ ఘట్టమనేని పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలోనే కార్తీక్ దర్శకత్వం వహించిన ‘మిరాయ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తమ సంస్థకు సూపర్ హిట్ అందించిన దర్శకుడు కావడం, ఆయన విజువల్ టేకింగ్‌పై పూర్తి నమ్మకం ఉండటంతో.. ప్రభాస్ కోసం కథను సిద్ధం చేసే బాధ్యతను కార్తీక్కే అప్పగించారు.
ప్రస్తుతం చేతినిండా భారీ పాన్-ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ప్రభాస్, తన ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి కాగానే ఈ క్రేజీ థ్రిల్లర్‌ను 2027లో పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు. నిర్మాతల శ్రేయస్సు కోరి ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీలో ఆయన గొప్ప వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించగా.. ఇటు ‘మిరాయ్’ వంటి సక్సెస్ఫుల్ కాంబినేషన్లో ప్రభాస్ హీరోగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. చూద్దాం.. ఈ మూవీ అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో..
ఇవి కూడా చదవండి:
Prabhas: టాలీవుడ్ ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే
నిజమైన హీరోలేనా.. లేక ‘డూప్’లా? ‘జైలర్ 2’తో మొదలైన కొత్త చర్చ
‘రామాయణ’ టికెట్ ధరలు.. దిల్ రాజు కీలక నిర్ణయం