అల్లు అర్జున్‌కి అర్ధరాత్రి విజయ్ దేవరకొండ ఫోన్.. అసలేం జరిగిందంటే
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:24 PM
అర్ధరాత్రి విజయ్ దేవరకొండ ఫోన్ చేయగానే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. ఆయన ఎందుకు ఫోన్ చేశారు? అసలు విషయం ఏమిటనేది..
బాలీవుడ్ ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) హోస్ట్ చేసే పాపులర్ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan)లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సందడి చేశారు. ఆయనతో పాటు నేషనల్ క్రష్ రశ్మిక మందన్న కూడా ఈ షోలో పాల్గొన్నారు. షోలో భాగంగా జరిగే ఫన్నీ గేమ్‌లో విజయ్ దేవరకొండ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)కి ఫోన్ చేయడం, వారి మధ్య జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గేమ్ రూల్స్‌లో భాగంగా రాత్రి 11:40 సమయంలో సినీ ప్రముఖులకు ఫోన్ చేసి మాట్లాడాల్సి రాగా, విజయ్ దేవరకొండ ఏమాత్రం తడుముకోకుండా బన్నీకి కాల్ చేశారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘‘బన్నీ అన్నా.. వీళ్ళకి టైం సందర్భం ఏమీ లేదు. 11:40కి ఎవరికైనా కాల్ చేయమంటున్నారు. ఈ టైంలో కాల్ చేస్తే నన్ను తిట్టకుండా ఎవరు మాట్లాడుతారా? ఇండస్ట్రీలో నన్ను అంతగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారా? అని ఆలోచిస్తే నాకు వెంటనే గుర్తొచ్చింది నువ్వే అన్నా. ఆ చనువుతోనే కాల్ చేశా’’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. విజయ్ ఫోన్ చేయగానే అల్లు అర్జున్ వెంటనే కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడారు. అనంతరం కరణ్ జోహార్ ఫోన్ తీసుకొని.. గేమ్‌లో విజయ్‌కి పాయింట్లు రావాలంటే ‘హే కరణ్, ఇట్స్ మీ’ అని చెప్పాలని బన్నీని కోరారు. దానికి అల్లు అర్జున్ ఏమాత్రం మొహమాటపడకుండా నవ్వుతూ ఆ డైలాగ్ చెప్పడంతో విజయ్‌కి పూర్తి పాయింట్లు దక్కాయి.
మరోవైపు రశ్మిక కూడా ‘పుష్ప’ కో-స్టార్ అయిన అల్లు అర్జున్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. కాకపోతే అది విజయ్ కాల్ కావడంతో కరణ్ జోహార్ జోక్యం చేసుకుంటూ రశ్మికను ఆటపట్టించారు. అర్ధరాత్రి వేళ కూడా విజయ్ కాల్ని రిసీవ్ చేసుకుని సరదాగా మాట్లాడిన అల్లు అర్జున్ స్వీట్ గెస్చర్పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. విజయ్, రశ్మిక మందన్నా కలిసి చేసిన ‘రణబాలి’ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విజయ్, రశ్మిక కలిసి చేసిన మూడో చిత్రమిది. అంతకు ముందు ‘గీతగోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్
RC17కు ‘దేవి శ్రీ ప్రసాద్’ ఉంటారా? క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్
‘వృషకర్మ’ పోస్టర్లో డివైన్ వైబ్స్.. నాగచైతన్య ఇంటెన్స్ లుక్ అదుర్స్