చొక్కా నలగకుండా రూ. 500 కోట్లు.. సూపర్‌స్టార్‌కే సాధ్యం: అల్లు అర్జున్

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:24 PM

సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద తన సరికొత్త చిత్రం ‘జైలర్ 2’ తో మరోసారి ప్రభంజనం సృష్టిస్తున్నారు. తాజాగా ఈ మూవీ సక్సెస్‌పై అల్లు అర్జున్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Allu Arjun and Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్ (Super Star Rajinikanth) బాక్సాఫీస్ వద్ద తన సరికొత్త చిత్రం ‘జైలర్ 2’ (Jailer 2)తో మరోసారి ప్రభంజనం సృష్టిస్తున్నారు. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ (Sun Pictures) నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) ‘ఎక్స్’ వేదికగా ఈ సినిమాపై, రజనీకాంత్ మేనియాపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘జైలర్ 2’ సినిమాను చూసి ఫిదా అయిన బన్నీ, రజనీ స్వాగ్‌ను కొనియాడుతూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


రజనీకాంత్ స్టార్ పవర్, ఆయనలోని స్వాగ్, ఆరాకు ‘జైలర్ 2’ ఒక పర్ఫెక్ట్ నిదర్శనమని, సినిమా చూస్తున్నంతసేపు అడ్రినలిన్ రష్ కలిగించే అద్భుతమైన కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని అల్లు అర్జున్ తన పోస్టులో పేర్కొన్నారు. ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తన మ్యూజిక్‌తో చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడని, నెల్సన్ దిలీప్‌కుమార్ ఒక షోమ్యాన్‌లా ఈ కూలెస్ట్ హిట్‌ను అందించారని కొనియాడారు. ఇదే క్రమంలో తెలుగులో ప్రత్యేకంగా రాస్తూ.. ‘‘చొక్కా నలగకుండా 500 ప్లస్ కోట్లు కొట్టడం ఒక్క రజనీ గారికే సాధ్యం!’’ అంటూ బ్లాక్ హార్ట్ ఎమోజీతో రజనీ మేనియాకు సెల్యూట్ చేశారు.


చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్‌తో పాటు మొత్తం నటీనటులు, సాంకేతిక బృందానికి అల్లు అర్జున్ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా ఇదే సన్ పిక్చర్స్ బ్యానర్‌లో స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ అనే భారీ పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థతో మంచి అనుబంధం ఉన్న బన్నీ, వారి తాజా సంచలనం ‘జైలర్ 2’ ఘనవిజయంపై ఇలా ఆత్మీయంగా స్పందించడం ఇరు హీరోల అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. ఈ పోస్ట్‌తో అల్లు అర్జున్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి:

‘డ్యూన్ 3’ దెబ్బకు ‘ద ఒడిస్సీ’ రికార్డ్ బద్దలైంది

అల్లు అర్జున్‌కి అర్ధరాత్రి విజయ్ దేవరకొండ ఫోన్.. అసలేం జరిగిందంటే

‘కిల్లర్’ సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. రూ. కోటి గెలుచుకోండి: దర్శకుడు పూర్వాజ్

Updated Date - Oct 22 , 2026 | 05:24 PM

Jailer 2 Trailer: ఈ కాలపు స్టైల్.. అక్కడే బాంబు పెట్టడం 

Jailer 2: జైలర్ అరాచకం వెనకాల జరిగింది ఇదే..

Jailer 2: దర్శకుడు ఏం చెప్పారంటే..

Raaka Movie: అల్లు అర్జున్ వైల్డ్ ఎంట్రీ సీన్‌పై అదిరిపోయే అప్‌డేట్.. అట్లీ మాస్టర్ ప్లాన్

Raaka: 'రాకా’పై శిబి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..