Peddi: అఫీషియల్.. ‘పెద్ది’ న్యూ సీన్స్ గురువారం నుంచే..
ABN , Publish Date - Jun 17 , 2026 | 10:39 PM
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. ఈ సినిమాలో కొన్ని కొత్త సన్నివేశాలను యాడ్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), స్టార్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన రూరల్ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు 2026లోనే సౌత్ ఇండియాస్ నెం.1 గ్రాసర్‌గా నిలిచి, కలెక్షన్ల పరంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్, రత్నవేలు విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది.
ఇక ఇప్పటికే కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, ఈ వీకెండ్‌లో మరింత దుమ్ము లేపడానికి ‘పెద్ది’ టీమ్ ఒక అదిరిపోయే మాస్టర్ ప్లాన్ వేసింది. రేపు జూన్ 18, గురువారం నుంచి ఈ సినిమాకు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల సరికొత్త సీన్లను జోడించబోతున్నారు. ఇప్పటివరకు థియేటర్లలో చూడని సరికొత్త కంటెంట్‌ను యాడ్ చేస్తుండటంతో, అభిమానుల్లో.. అలాగే సాధారణ ప్రేక్షకుల్లో ఈ సినిమాను మళ్లీ చూడాలనే క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఏమేం సీన్లు యాడ్ చేశారు.. ఎక్కడెక్కడ న్యూ సన్నివేశాలు కలిపారనేది తెలుసుకునేందుకు కూడా ప్రేక్షకులు క్యూ కట్టే అవకాశం ఉంది.
సాధారణంగా ఒక సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నప్పుడు.. ఇలాంటి కొత్త సీన్లు యాడ్ చేస్తే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య మరింత పెరుగుతుంది. ‘పెద్ది’ టీమ్ ప్లానింగ్ చూస్తుంటే ఈ జూన్ 18 నుంచి రాబోయే వీకెండ్‌లో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ ఖాయంగా కనిపిస్తోంది. సరికొత్త సీన్లతో థియేటర్లలో ‘పెద్ది’ సృష్టించబోయే మరిన్ని సంచలనాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఓవర్సీస్ మార్కెట్‌లో కాస్త డౌన్‌లో ఉన్న ‘పెద్ది’ ఈ న్యూ సీన్లతో సెట్ అయిపోతుందని మేకర్స్ భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్‌ని రాబట్టినట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు ‘పెద్ది’ సారొ!
మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా?
‘బెంగళూరు నాగరత్తమ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..