Peddi movie: మేకోవర్ మొదలైంది
ABN , Publish Date - Jul 22 , 2025 | 06:09 AM
రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక...
రామ్‌చరణ్ కథానాయకుడిగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు కీలక షెడ్యూళ్ల చిత్రీకరణను పూర్తి చేసింది చిత్రబృందం. తదుపరి జరిగే షెడ్యూల్ కోసం బీస్ట్ లుక్‌లోకి మారిపోయారు రామ్‌చరణ్. ఈ సందర్భంగా కండలు తిరిగిన దేహంతో జిమ్‌లో కసరత్తులు చేస్తున్న పిక్‌ను రామ్‌చరణ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ‘పెద్ది’ కోసం మేకోవర్ మొదలైంది. ఈ సవాలు కఠినమైనదైనా.. ఎంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని పేర్కొన్నారు. ఇప్పుడీ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఇటీవలె విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత రెట్టింపు చేసింది. క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌చరణ్ పాత్ర శక్తిమంతంగా ఉండబోతోంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. జగపతిబాబు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాణ సంస్థలు మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకటసతీష్ కిలారు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న చిత్రం విడుదలవుతోంది.