సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!

ABN, Publish Date - May 04 , 2026 | 01:01 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది.

Buchi Babu Sana And Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) రూపొందిస్తోన్న భారీ చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). జూన్ 4న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోన్న విషయం తెలిసిందే. జూన్ 3 రాత్రి నుంచే ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు. ఈ వీక్‌లోనే ఈ ప్రీమియర్స్‌కు సంబంధించిన బుకింగ్‌ని ఓపెన్ చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా 30 రోజుల మాత్రమే సమయం ఉంది. ‘పెద్ది’పై మొదటి నుంచి ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి అంచనాలున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో దర్శకుడు బుచ్చిబాబు సానా స్ట్రాటజీ ఏంటనేది ఎవరికీ అర్థం కావడం లేదు.


అందుకు కారణం ఏమిటంటే.. ఇప్పటి వరకు రామ్ చరణ్ మినహా, సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్న వారి గురించి బుచ్చి.. ఎటువంటి క్లూ బయటకు రానివ్వ లేదు. ఇందులో కన్నడ స్టార్ యాక్టర్ శివ రాజ్‌కుమార్, విలక్షణ నటుడు జగపతిబాబు, బాలీవుడ్ స్టార్ యాక్టర్ దివ్యేందు శర్మలతో పాటు.. హీరోయిన్‌గా నటిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పాత్రలకు సంబంధించిన విషయాన్ని కూడా ఎక్కడా రివీల్ చేయడం లేదు. కేవలం ఫస్ట్ లుక్స్ వరకే రిలీజ్ చేశారు తప్పితే.. ఆ పాత్రల స్వభావం ఏంటనేది ఇప్పటి వరకు చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ లుక్స్‌తో పాటు వారి పాత్రల స్వభావం కూడా కాస్త రివీల్ చేసి ఉంటే, మరింతగా సినిమాపై క్రేజ్ పెరిగేదనేలా.. సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు దర్శనమిస్తున్నాయి.


ఇప్పటి వరకు రామ్ చరణ్‌‌పై మాత్రమే ఫోకస్ పెట్టిన బుచ్చిబాబు ఇకపై.. ఇతర పాత్రల విషయంలో కూడా కాస్త దృష్టి పెట్టాల్సి ఉంది. ఎందుకంటే, ఇందులో అలాంటి భారీ స్టార్ కాస్ట్ ఉంది. అలాగే జాన్వీ కపూర్‌ని కూడా కాస్త హైలైట్ చేయాల్సి ఉంది. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా ఓన్లీ రామ్ చరణ్‌‌పై మాత్రమే ఫోకస్ పెట్టి, సినిమాలో ఉన్న మ్యాటర్‌ని ప్రేక్షకులకు రీచ్ చేయలేక పోయారు. ఆ తప్పు బుచ్చిబాబు రిపీట్ చేయకుండా, ఇప్పటి నుంచైనా ప్రమోషన్స్ విషయంలో క్లారిటీగా ఉంటే బెటరని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. ‘మీర్జాపూర్’ సిరీస్‌తో యూత్, జెన్-జీ ప్రేక్షకులలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న దివ్యేందును కూడా ప్రమోషన్స్‌కు వాడుకుంటే మంచి బజ్ ఏర్పడుతుందనేలా కూడా కొందరు బుచ్చికి సలహాలు ఇస్తున్నారు. చూద్దాం మరి.. ఈ నెల రోజులు బుచ్చి స్ట్రాటజీ ఎలా ఉంటుందో? వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

త్రిష బర్త్‌డే.. విజయంతో విజయ్ ట్రీట్ ఇస్తాడా? లేక!

‘సన్ రైజర్స్‌’కు సపోర్ట్ చేస్తున్న ఈ భామ ఎవరో గుర్తు పట్టారా?

Varanasi: ‘వారణాసి’కి వాటర్ కొరత!.. మహేష్ సినిమాకు ప్రభుత్వం షాక్!

‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

Updated Date - May 04 , 2026 | 01:45 PM