Buchibabu: బుచ్చిబాబు తదుపరి చిత్రంపై క్లారిటీ

ABN , Publish Date - May 06 , 2025 | 03:29 PM

దర్శకుడు సానా బుచ్చిబాబు (Buchibabu Sana) ప్రస్తుతం పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారు. తదుపరి సినిమాకూ కసరత్తులు మొదలుపెట్టారు. తన లైనప్‌ మరో లెవల్‌లో సెట్‌ చేసుకొనే పనిలో ఉన్నాడు.

buchhibabu

దర్శకుడు సానా బుచ్చిబాబు (Buchibabu Sana) ప్రస్తుతం 'పెద్ది' సినిమాతో బిజీగా ఉన్నారు. తదుపరి సినిమాకూ కసరత్తులు మొదలుపెట్టారు. తన లైనప్‌ మరో లెవల్‌లో సెట్‌ చేసుకొనే పనిలో ఉన్నాడు. ‘ఉప్పెన’తో తన సత్తా చాటిన బుచ్చిబాబు... రామ్‌చరణ్‌తో సినిమా సెట్‌ చేసుకున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా విడుదల చేసిన ‘పెద్ది’ గ్లింప్స్‌తో అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్నాడు దర్శకుడు. ఇప్పుడు మరో చర్చ మొదలైంది. ‘పెద్ది’ తరవాత బుచ్చిబాబు ఏం చేయబోతున్నాడు? ఇదే టాపిక్‌. తాజాగా సమాచారం ప్రకారం ‘పెద్ది’ అయ్యాక మహేష్‌ బాబుతో (Maheshbabu) సినిమా చేయబోతున్నారని తెలిసింది. దీనికి కారణం సుకుమార్‌ (Sukumar) అని అంటున్నారు.

‘వన్‌’ సినిమాకు బుచ్చి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశాడు. ఆ సమయంలో మహేష్‌ తో సాన్నిహిత్యం ఏర్పడిందట. ‘ఉప్పెన’ తరవాత కూడా మహేష్‌, బుచ్చి కలుసుకొన్నారు. ‘మంచి కథ ఉంటే చెప్పు, చేద్దాం’ అని మాట ఇచ్చాడట మహేష్‌. అందుకే.. మహేష్‌ కోసం ఓ కథ సిద్థం చేేస పనిలో ఉన్నాడు. ఈసారి బుచ్చి యాక్షన్‌ డ్రామా రాస్తున్నాడని, మహేష్‌ని నెక్ట్స్‌ లెవల్‌లో చూపించే ప్రయత్నాల్లో బుచ్చిబాబు ఉన్నాడని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ప్రస్తుతం మహేష్‌ ఎస్‌ఎస్‌ఎంబీ29తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి కావడానికి మరో సంవత్సరం అయినా పడుతుంది. ‘పెద్ది’ కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజమౌళి సినిమా పూర్తి కాగానే బుచ్చిబాబు సినిమా ట్రాక్‌లోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Updated Date - May 06 , 2025 | 03:53 PM