‘పెద్ది’తో ఫైట్‌కు మహేష్ బాబు ఓకే అంటాడా?

ABN , Publish Date - May 03 , 2026 | 05:21 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ నటించిన ‘పెద్ది’ సినిమాకు పోటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాను దింపుతారా? అదేంటని ఆశ్చర్యపోతున్నారు కదా!

Ram Charan and Mahesh Babu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ (Mega Power Star Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi) సినిమాకు పోటీగా సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) తన సినిమాను దింపుతారా? అదేంటి, ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’ (Mahesh Babu Varanasi) సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు కదా! మరి ఈ పోటీ ఏంటి? ఒక వేళ ఆయన ఓల్డ్ సినిమా ఏదైనా, ఆ టైమ్‌కి రీ రిలీజ్ చేస్తున్నారా? అంటే, అలాంటిదేమీ లేదు. అసలు విషయం ఏమిటంటే, మహేష్ బాబు నటించిన సినిమా కాదు, ఆయన నిర్మించిన సినిమా ఇప్పుడు ‘పెద్ది’గా పోటీగా దిగేందుకు సిద్ధమైంది. ఆ సినిమా ఏంటి? అనే వివరాలలోకి వెళితే..


సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో.. వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా, దర్శకుడు వెంకటేష్ మహా రూపొందిస్తోన్న మోస్ట్ అవైటెడ్ సైకాలజికల్ థ్రిల్లర్ చిత్రం ‘రావు బహదూర్’ (Rao Bahadur). ఈ సినిమాను ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఫిక్స్ అవకముందే, జూన్ 5వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సడెన్‌గా ‘పెద్ది’ సినిమా జూన్ 4వ తేదీ విడుదల అని, ఆ చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. దీంతో, ‘పెద్ది’కి పోటీగా మహేష్ బాబు నిర్మిస్తోన్న ఈ ‘రావు బహదూర్’ సినిమా విడుదలవుతుందా? లేదంటే, వాయిదా వేస్తారా? అనేలా టాక్ మొదలైంది.


‘పెద్ది’ సినిమా ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి, మూడో సారి ఎట్టకేలకు విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మరోవైపు పర్సంటేజ్ విషయంలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్స్‌కు మధ్య కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ క్రమంలో మరోసారి ‘పెద్ది’ వాయిదా పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేలా వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మహేష్ అండ్ టీమ్ ‘రావు బహదూర్’ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ‘పెద్ది’తో పోటీ కంటే, సత్యదేవ్ చిత్రాన్ని మరో డేట్‌కి విడుదల చేస్తేనే బాగుంటుందనేలా కూడా కొందరు సలహాలు ఇస్తున్నారు. ఎందుకంటే, సత్యదేవ్‌కి ఇప్పటికీ రావాల్సిన గుర్తింపు రాలేదు. ‘రావు బహదూర్’ ప్రమోషనల్ కంటెంట్ చూస్తుంటే.. విషయం ఉన్నట్లే కనిపిస్తోంది. అలాంటప్పడు రామ్ చరణ్ సినిమాతో పోటీ కంటే, సోలోగా మరో డేట్‌ చూసుకుని వస్తే బెటర్ అనేలా.. ‘రావు బహదూర్’ టీమ్‌కు నెటిజన్లు సూచిస్తున్నారు. చూద్దాం మరి.. ఫైనల్‌గా ఏం జరుగుతుందో?

ఇవి కూడా చదవండి:

ఒకే వేడుకలో చైతూ-శోభిత, సమంత-రాజ్ జంటలు హల్చల్!

పవన్ కళ్యాణ్ నివాసానికి సీఎం చంద్రబాబు.. ఫొటోలు వైరల్!

‘నా పెళ్ళాం నిప్పు రా’.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పోస్ట్ వైరల్!

కయాదు లోహర్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

Updated Date - May 03 , 2026 | 05:21 PM

Mahesh Babu : దేశంలో అత్యుత్తమ నటుల్లో  ఆయనొకరు! 

Mahesh Babu All Time Record: సూపర్ స్టార్ 'బిజినెస్ మేన్' అల్ టైం రికార్డు

Mahesh Babu : తండ్రి విగ్రహావిష్కరణ.. మహేష్‌ ఏమన్నారంటే..

Peddi : రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. మోత మోగడమే

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది